WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్ ఎందులో? టైమింగ్, వెన్యూ ఏంటి?
WTC Final 2023 Live Streaming: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేళైంది! మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? ఎన్ని గంటలకు మొదలవుతుంది? వేదిక ఏంటి? ఎంపిక చేసిన జట్ల వివరాలు మీకోసం!
WTC Final 2023 Live Streaming:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేళైంది! పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) తుది పోరులో తలపడుతున్నాయి. 'టెస్టు గద' కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? ఎన్ని గంటలకు మొదలవుతుంది? వేదిక ఏంటి? ఎంపిక చేసిన జట్ల వివరాలు మీకోసం!
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎప్పుడు జరుగుతోంది?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7న మొదలవుతుంది. 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచుకు అంతరాయం కలిగితే ఆరో రోజు ఆడిస్తారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక ఏంటి?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లండన్‌లో జరుగుతోంది. అక్కడి ఓవల్ మైదానంలో మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనళ్లను ఇంగ్లాండ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ టైమింగ్ ఏంటి?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మొదలవుతుంది. అయితే భారత్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు మొదలవుతాయి.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లైవ్ టెలికాస్ట్ ఎందులో వస్తోంది?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ హక్కులను స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్ గెలుచుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 2, స్టార్‌స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్‌స్పోర్ట్స్ 1 హెచ్‌డీ ఛానళ్లలో ప్రసారం అవుతుంది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ మ్యాచును వీక్షించొచ్చు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో వస్తోంది?
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రీమియం, సూపర్, సూపర్ + యాడ్‌ఫ్రీ ప్లాన్లను సబ్‌స్రైబ్ చేసుకోవడం ద్వారా మ్యాచులను ఎంజాయ్ చేయొచ్చు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఎంపికైన భారత జట్టు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేశ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు
ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టాయినిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా
The India spinner can point to the moment that turned around a faltering #WTC23 campaign and ultimately set up an #AUSvIND Final 🏆https://t.co/mFISK2gwxI
— ICC (@ICC) June 6, 2023