News
News
X

100 రూపాయలతో ఉమెన్‌ ప్రీమియర్ లీగ్ చూసే ఛాన్స్‌, టికెట్లు బుక్ చేసుకోవడం ఎలాగో చూసేయండిక్కడ?

మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్తేజకరమైన లీగ్‌ చూసేందుకు మహిళలకు ప్రవేశం ఉచితం. కేవలం రూ .100తో మ్యాచ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ మార్చి 4 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ముంబై, గుజరాత్ జట్ల మధ్య జరగనుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లీగ్‌లో థ్రిల్‌ను పెంచుతూ అభిమానులకు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. వాస్తవానికి మహిళలకు బీసీసీఐ టికెట్లను ఉచితంగా అందిస్తోంది. అదే సమయంలో పురుషులకు కేవలం 100 రూపాయలకే మ్యాచ్ టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌కు ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

డబ్ల్యూపీఎల్ మ్యాచ్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

ముందుగా బుక్ మైషో వెబ్సైట్‌కు వెళ్లండి లేదా మొబైల్లో యాప్ ఓపెన్ చేయండి.

ఆ తర్వాత వెబ్సైట్ లేదా యాప్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరిగే నగరాన్ని ఎంచుకోండి.

నగరాన్ని ఎంపిక చేసిన తర్వాత అక్కడ జరిగే అన్ని మ్యాచ్ ల జాబితా ఉంటుంది. ఆ తర్వాత స్టేడియంలో చూడాలనుకుంటున్న మ్యాచ్ను ఎంచుకోండి. ఎంచుకున్న తరువాత, బుక్ నౌ మీద క్లిక్ చేయండి.

దీని తరువాత, సీటింగ్ కేటగిరీ మరియు మీకు కావలసిన సీట్ల సంఖ్యను ఎంచుకోండి. మ్యాచ్ ఎంపిక తర్వాత సీటింగ్ లేఅవుట్ పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. దీని సాయంతో మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. అదే సమయంలో ఇక్కడ మీకు కావాల్సిన సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు.

సీటును ఎంచుకున్న తరువాత, మీ పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని ఇవ్వండి. మీరు ఈ వివరాలను సరిగ్గా నింపారని గుర్తుంచుకోండి. దీని ద్వారా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, 

దీని తరువాత, మీరు టికెట్ కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులు చేయడానికి మీకు అనేక ఆప్షన్స్‌ ఉంటాయి. మీ సౌలభ్యాన్ని బట్టి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి.

మీరు పేమెంట్ చేసిన వెంటనే, మీకు టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. బుకింగ్ పూర్తయిన తర్వాత, మీ టికెట్లను సేకరించండి. టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కు సంబంధించిన సమాచారం మెయిల్, ఫోన్ నంబర్ కు కూడా పంపిస్తారు. 

ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్ల మధ్య జరిగే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌ను మొత్తం సీజన్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కలిగి ఉన్న స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో  ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రి 7:30 గంటలకు చూడవచ్చు. ఈ మ్యాచ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను సినిమా యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. మ్యాచ్‌ను 4కే స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది. 

బలంగా కనిపిస్తున్న ముంబై
ముంబై ఇండియన్స్‌ అత్యంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, పూజా వస్త్రాకర్‌ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలరు. ముంబైలో హర్మన్‌కు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఆమెకిది అచ్చొచ్చిన నగరం. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ షవర్‌ బ్రంట్‌ స్పిన్‌, పేస్‌ను సునాయసంగా ఆడగలదు. మీడియం పేస్‌ బౌలింగ్‌తో అదరగొట్టగలదు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే పూజా వస్త్రాకర్‌ లోయర్‌ ఆర్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. ప్రతి విభాగంలోనూ ముంబైకి ప్రత్యామ్నాయ క్రికెటర్లు ఉన్నారు. అటాకింగ్‌ వికెట్‌ కీపర్‌ లేకపోవడం లోటు. హేలీ మాథ్యూస్‌, అమెలియా కెర్‌ కీలకం అవుతారు.

సమతూకంతో గుజరాత్‌ జెయింట్స్
గుజరాత్‌ జెయింట్స్‌ వేలంలో సమతూకమైన జట్టును ఎంపిక చేసింది. స్నేహ్‌ రాణా బంతిని చక్కగా ఫ్లైట్‌ చేయగలదు. ముంబై పిచ్‌లపై ఆమె కీలకం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌లో ప్రాధాన పాత్ర పోషించిన యాష్లే గార్డ్‌నర్‌ ఇందులోనే ఉంది. బ్యాటు, బౌలింగ్‌తో ఆమె మాయ చేయగలదు. మిడిలార్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. బ్యాటింగ్‌, బౌలింగులో మంచి ఆప్షన్లు ఉన్నాయి. కెప్టెన్‌ బెత్‌మూనీ నిలిచిందంటే పరుగుల వరదే. అనబెల్‌ సుథర్‌  డియాండ్రా డాటిన్‌ బంతి, బ్యాటుతో దుమ్మురేపుతారు. హర్లీన్‌ డియోల్‌, ఎస్‌ మేఘనా, డీ హేమలతకు ఎక్కువ అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరం.

Published at : 04 Mar 2023 09:02 AM (IST) Tags: Womens Premier League WPL 2023 WPL 2023 Live Womens IPL 2023 WPL Tickets Online

సంబంధిత కథనాలు

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు