WPL 2023: ఐపీఎల్‌లో 15 ఏళ్ల క్రితం ధోనీ కొట్టలేని రికార్డుపై కన్నేసిన హర్మన్‌ప్రీత్!
WPL 2023: టీమ్‌ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ అరుదైన రికార్డుపై కన్నేసింది! 15 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోనీకి సాధ్యమవ్వని ఘనతను సాధించాలని పట్టుదలగా ఉంది.
WPL 2023, Harmanpreet Kaur:
టీమ్‌ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ అరుదైన రికార్డుపై కన్నేసింది! 15 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోనీకి సాధ్యమవ్వని ఘనతను సాధించాలని పట్టుదలగా ఉంది. అరంగేట్రం విమెన్ ప్రీమియర్ లీగులో ఆస్ట్రేలియా కెప్టెన్‌ను ఓడించి ట్రోఫీ అందుకోవాలని కలగంటోంది. అప్పట్లో సీఎస్‌కే కెప్టెన్‌కు అసాధ్యమైన ఈ ఫీట్‌ను ఆమె నిజం చేయగలదా?
ఇండియన్ ప్రీమియర్ లీగులో అద్భుతాలు చేసిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అప్పటి టీమ్‌ఇండియా నాయకుడు ఎంఎస్ ధోనీయే (MS Dhoni) దీనికి కెప్టెన్. జాతీయ జట్టును ఎలా నడిపించాడో సీఎస్‌కేనూ (CSK) అలాగే చూసుకున్నాడు. ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీ అందించాడు. ఆటగాళ్ల ఎంపిక దగ్గర్నుంచి వ్యూహాల వరకు అన్నీ అతడి అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. అలాంటిది అరంగేట్రం సీజన్లో మాత్రం చెన్నైకి ట్రోఫీ అందించలేకపోయాడు.
చెన్నై సూపర్ కింగ్స్ 2008లో సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో సమతూకంగా ఉండేది. మైకేల్ హస్సీ, మఖాయా ఎన్తిని, ముత్తయ్య మురళీధరన్, మాథ్యూ హెడేన్ వంటి సీనియర్లు, రవిచంద్రన్ అశ్విన్, ఆల్బీ మోర్కెల్, పార్థివ్ పటేల్, సురేశ్ రైనా వంటి కుర్రాళ్లు అదరగొట్టారు. అయితే ఫైనల్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీసేనకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.
విమెన్ ప్రీమియర్ లీగులోనూ (WPL 2023) ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. టీమ్‌ఇండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీతే (Harmanpreet Kaur) ముంబయి ఇండియన్స్‌ను (MI Women) నడిపిస్తోంది. జూనియర్, సీనియర్ల మేళవింపుతోనే జట్టు ఫైనల్‌కు చేరుకుంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్, అమెలియా కెర్, ఇస్సీవాంగ్, సైకా ఇషాకి వంటి అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అప్పట్లాగే ఫైనల్ చేరిన మరో జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను ఆసీస్ కెప్టెన్ మెగ్‌లానింగ్ నడిపిస్తోంది. విచిత్రంగా హర్మన్, ధోనీ ఏడో నంబర్ జెర్సీనే ధరిస్తారు.
THIS is what we are playing for! 🔥🏆@ImHarmanpreet | #OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #ForTheW pic.twitter.com/BKWrORh1En
— Mumbai Indians (@mipaltan) March 25, 2023
Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: అంతకు ముందు మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 182 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 72 పరుగులతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ఓడిన యూపీ ఇంటి బాట పట్టింది.
Issy 🤌🤌 Harry
— Mumbai Indians (@mipaltan) March 25, 2023
Jinti 👏
MumbaiKerr 🗣️
This POTM celebration has all our 💙@ImHarmanpreet @Wongi95 @meliekerr10 | #OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #ForTheW pic.twitter.com/4eUodnkQDa