News
News
X

DCW vs UPWW: ఓటమి తప్పించుకొనేదీ ఎవరు? యూపీ వారియర్జ్‌పై షెఫాలీ విధ్వంసం ఖాయమేనా!

DCW vs UPWW: విమెన్‌ ప్రీమియర్ లీగు ఐదో మ్యాచులో నేడు దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ (DCW vs UPWW) తలపడబోతున్నాయి. నేడు ఎవరో ఒకరికి ఓటమి తప్పదు.

FOLLOW US: 
Share:

DCW vs UPWW, WPL 2023: 

విమెన్‌ ప్రీమియర్ లీగు ఐదో మ్యాచులో నేడు దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ (DCW vs UPWW) తలపడబోతున్నాయి. ఇప్పటికీ రెండు జట్లు చెరో విజయం సాధించి జోష్‌లో ఉన్నాయి. నేడు ఎవరో ఒకరికి ఓటమి తప్పదు. యూపీతో పోలిస్తే డీసీ కాస్తంత సమతూకంగా కనిపిస్తోంది. మరి నేటి పోరులో విజేత ఎవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? కీలక క్రికెటర్లు ఎవరు?

సారథుల పోరాటం

ఆస్ట్రేలియాకు నాలుగు టీ20 ప్రపంచకప్‌లు అందించిన సారథి మెగ్‌లానింగ్‌ (Meg Lanning). ఆమెకు అన్నింట్లో అండగా నిలిచింది అలీసా హీలీ (Alyssa Healy). నేడు ఈ ఇద్దరూ వేర్వేరు జట్ల తరఫున నేడు డీవై పాటిల్‌ స్టేడియంలో (Dy Patil Stadium) పోటీపడనున్నారు. ఆర్సీబీ మ్యాచులో రాధా యాదవ్‌ కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చింది. ఆమె స్థానంలో డీసీ బహుశా పూనమ్‌ యాదవ్‌ను ప్రయత్నించొచ్చు. టీ20 ప్రపంచకప్‌ నుంచి విరామం లేకుండా ఆడుతున్న మారిజానె కాప్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ఆమె స్థానంలో లారా హ్యారిస్‌, టిటాస్‌ సాధుకు అవకాశం దొరుకుతుంది. గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించినప్పటికీ యూపీ వారియర్జ్‌ మిడిలార్డర్‌ ఘోరంగా విఫలమైంది. గ్రేస్‌ హ్యారిస్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ కలిసి ఆఖరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయకుంటే ఓటమి పాలయ్యేది. ఈ విభాగంలో వారు మెరుగవ్వాల్సి ఉంది.

వీళ్లు  కీలకం

మొదటి మ్యాచులో బ్రబౌర్న్‌ మైదానంలో డీసీ బ్యాటర్‌ షెఫాలీ వర్మ (Shafali Verma) విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు డీవై పాటిల్‌లోనూ అదే దూకుడు కొనసాగించొచ్చు. హోమ్‌ గర్ల్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) సైతం సాలిడ్‌గా కనిపిస్తోంది. తొలి మ్యాచులో హాఫ్‌ సెంచరీ చేసిన కిరన్‌ నవగిరెపై (Kiran Navgire) యూపీ ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు జాతీయ జట్టులో అవకాశాలను దుర్వినియోగం చేసుకున్న ఆమెకు డబ్ల్యూపీఎల్‌ (WPL 2023) ఓ మంచి వేదిక. గ్రేస్‌ హ్యారిస్‌ నుంచి ఆమెకు బ్యాకప్‌ ఉంది. రాజేశ్వరీ గైక్వాడ్‌ కాస్త నిరాశపరిచింది. యువ స్పిన్నర్‌ పర్వేశి చోప్రా ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె మెరుగ్గా ఆడటం ముఖ్యం,

తుది జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, మారిజానె కాప్‌ / లారా హ్యారీస్‌, జెమీమా రోడ్రిగ్స్‌, అలిస్ క్యాప్సీ, జెస్‌ జొనాసెన్‌, తానియా భాటియా, అరుంధతీ రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌

యూపీ వారియర్జ్‌ : అలిసా హీలీ, శ్వేతా షెరావత్‌, కిరన్‌ నవగిరె, తాహిలా మెక్‌గ్రాత్‌, దీప్తి శర్మ, గ్రేస్‌ హ్యారిస్‌, సిమ్రన్‌ షైక్‌, డేవికా వైద్య, సోఫీ ఎకిల్‌స్టోన్‌, అంజలీ శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్‌

Published at : 07 Mar 2023 04:11 PM (IST) Tags: Delhi Capitals alyssa healy deepti sharma Shafali Verma meg lanning WPL Womens Premier League WPL 2023 UP Warriorz DCW vs UPWW

సంబంధిత కథనాలు

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు