DC vs GG Highlights : చెలరేగిన షెఫాలీ వర్మ, గుజరాత్ పై దిల్లీ సునాయాస విజయం
DC vs GG Highlights : ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో దిల్లీ క్యాపిటల్స్ హాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ పై సునాయాసంగా గెలిచింది.
DC vs GG Highlights : ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం జరిగిన టీ20లో గుజరాత్ ను దిల్లీ ఓడింది. దీంతో హ్యాట్రిక్ విజయాలతో దిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. 106 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ కేవలం 7.1 ఓవర్లలోనే ఛేదించింది. దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ షెఫాలీ వర్మ 28 బంతుల్లో 72 పరుగులతో(10 ఫోర్లు, 5 సిక్స్) చెలరేగిపోయింది. షెఫాలీ కేవలం 19 బంతుల్లో అర్థశతకం పూర్తిచేసింది. మెగ్ లానింగ్ 21 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. దిల్లీ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హ్యాట్రిక్ విజయాలు దిల్లీ ఖాతాలో చేరాయి. ఐదు వికెట్లతో దిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన మారిజేన్ కాప్ ప్లేయర్ ఆఫ్ ది మూమెంట్ కు ఎంపికైంది.
మారిజేన్ కాప్ 5 వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టుకు ఫస్ట్ ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ బౌలర్ మారిజేన్ రెండో బంతికే సబ్బినేని మేఘనను డకౌట్ చేసింది. మేఘనను మారిజేన్ కాప్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ ఓవర్ల మారిజేన్ ఒక్క పరుగు ఇవ్వలేదు. మారిజేన్ కాప్ తర్వాతి ఓవర్లో వరుస బంతులకు వోల్వార్డ్ట్ (1), ఆష్లీ గార్డ్‌నర్ (0)ను ఫెవిలియన్ కు పంపింది. మరో బౌలర్ శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో హేమలత (5) వికెట్ తీసింది. మారిజేన్ కాప్ తన మూడో ఓవర్‌లో హర్లీన్ డియోల్‌ను ఔట్ చేసింది. తన నాలుగో ఓవర్ లో సుష్మా వర్మ (2)ను ఔట్ చేసి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ జట్టును జార్జియా, కిమ్ గార్త్ కాసేపు ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ లో కుదురుకుంటున్న వేర్‌హామ్‌ను 13 ఓవర్లో దిల్లీ బౌలర్ రాధాయాదవ్ క్లీన్‌బౌల్డ్ చేసింది. మ్యాచ్ 19 ఓవర్లో తనుజా కన్వార్ (13), స్నేహ్ రాణా (2)లను శిఖా పాండే ఔట్ చేసింది. ఇన్సింగ్ చివరి ఓవర్ వేసిన జొనాసెన్ 9 పరుగులు ఇవ్వడంతో గుజరాత్ 100 పరుగుల మార్క్ దాటింది.
గుజరాత్ కెప్టెన్ స్నేహ రానా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మారిజాన్ కాప్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. జట్టును ఆదుకుంటుందనుకున్న లారా వోల్వార్డ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హర్లీన్ డియోల్ రెండు మంచి షాట్ ఆడింది, అయితే 20 పరుగుల వద్ద కాప్ నాలుగు ఓవర్లో బౌల్ట్ చేసింది. ఆ తర్వాత జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్ గుజరాత్‌కు మంచి స్టాండ్‌ని అందించారు. శిఖా పాండే మూడు వికెట్లు తీయడంతో గుజరాత్ స్కోర్ మళ్లీ మందగించారు. గార్త్ కీలకమైన 32 పరుగులతో గుజరాత్‌ను 100 పరుగుల మార్కును దాటించింది. ఛేజింగ్‌కు వచ్చిన దిల్లీ ఓపెనర్లు షెఫాలీ వర్మతో పూర్తి స్థాయిలో చెలరేగిపోవడంతో సునాయాసంగా విజయం సాధించింది. ముంబైతో పాయింట్ల స్థాయికి వెళ్లడానికి విజయాన్ని అందుకుంది. ఆరు పాయింట్ల ముంబై టెబుల్ అగ్రస్థానంలో ఉండగా, ఆరు పాయింట్లతో దిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యూపీ, గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి.
రెండో స్థానంలో దిల్లీ
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ షేఫాలీ వర్మ, మెగ్ లానింగ్ చెలరేగిపోవడంతో కేవలం 7.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు. ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు లీగ్ మ్యాచుల్లో దిల్లీ క్యాపిట్లల్స్ మూడు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. మిగతా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలై నాలుగో స్థానంతో నిలించింది.
Shafali Verma show, what a knock - fifty from just 19 balls!!!#WPL #WPL2023 #TATAWPL #TATAWPL2023 #ShafaliVerma #DelhiCapitals #GGvDC #DCvGG #YeTohBasShuruatHai pic.twitter.com/QrcF7m41jZ
— TATA WPL #WPL2023 (@WomenCricLive) March 11, 2023