అన్వేషించండి
Advertisement
World Cup 2023: ప్రపంచకప్‌లో అయిదు భారీ విజయాలివే-మూడు రికార్డులు ఆస్ట్రేలియా పేరుపైనే
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్‌ను 309 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అతిపెద్ద విజయాన్ని సాధించి కొత్త రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్‌ను 309 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా తన పేరును రికార్డుల్లో లిఖించుకుంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గ్లెన్ మ్యాక్‌వెల్ చెలరేగడం.. డేవిడ్ వార్నర్ శతకంతో గర్జించడంతో కంగారులు ఈ రికార్డు సృష్టించారు. అయితే ప్రపంచకప్ చరిత్రలో అయిదు అతిపెద్ద విజయాలు ఏంటో చూద్దాం..
ప్రపంచకప్‌లో 5 అతిపెద్ద విజయాలు
1) ఈ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం.
2) 2015 ప్రపంచకప్‌లో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది. ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం.
3) 2007 ప్రపంచకప్‌లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో బెర్ముడాపై టీమిండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇది మూడో అతిపెద్ద విజయం.
4) 2015 ప్రపంచకప్‌లో సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇది నాలుగో అతిపెద్ద విజయం
5) 2003 ప్రపంచకప్‌లో నమీబియాపై ఆస్ట్రేలియా 256 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇది అయిదో అతిపెద్ద విజయం.
ప్రపంచకప్ చరిత్రలో అయిదో భారీ విజయాల్లో మూడు ఆస్ట్రేలియా పేరునే ఉండగా... ఒకటి భారత్. ఇంకోటి దక్షిణాఫ్రికా పేరున ఉన్నాయి. ఈ రికార్డులే ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకర ప్రత్యర్థో చెబుతోంది.
ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు విశ్వరూపం చూపింది. అయిదు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా... నెదర్లాండ్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీల డచ్ జట్టుపై విరుచుకుపడిన వేళ... ఆ జట్టు పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్... గ్లెన్ మ్యాక్స్‌వెల్, వార్నర్ శతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో కంగారులు ఘన విజయం సాధించారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్ వెల్ 106 పరుగులు చేశాడు. గ్లెన్ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. మ్యాక్స్ వెల్ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్ బాయ్... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్, లబుషేన్ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion