అన్వేషించండి
Advertisement
Womens T20 World Cup: కంగారులు మొదలెట్టారు, బ్రిటీషర్లు అదరగొట్టారు
WT20WC 2024: టీ 20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అదరగొట్టింది.6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇటు ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
England Australia victories in Womens T20 World Cup:
టీ 20 ప్రపంచకప్(Womens T20 World Cup)లో డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia) .. కప్పు వేటను ఘనంగా మొదలు పెట్టేసింది. తొలుత బ్యాట్‌తో తర్వాత బంతితో చెలరేగి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka)ను చిత్తు చేసిన కంగారులు.. ఈ పొట్టి ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంభించారు. ఈ మ్యాచ్‌టో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు లంకను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. మెగాన్ షట్ కేవలం 12 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు.. సోఫి మోలనూ 2 వికెట్లు తీయడంతో లంక కేవలం 93 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత కోలుకోలేదు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంకపై... కంగారులు అదే ఒత్తిడి కొనసాగించారు.
లంక బ్యాటర్లలో నీలాక్షిక సిల్వా 29 పరుగులు, హర్షిత సమరవిక్రమ 23 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 93 పరుగులకే పరిమితమైంది. అనంతరం 94 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 14. 2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలో ఆసిస్ బ్యాటింగ్ చూస్తే లంక ఏదైనా అద్భుతం చేస్తుందా అనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. పవర్‌ప్లే ముగిసే సరికి కంగారులు 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. కానీ ఓపెనర్ బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాకు ఘన విజయం అందించింది. లంకకు ఇది రెండో ఓటమి కావడంతో సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.
ఇంగ్లాండ్ ఘనంగానే..
పొట్టి ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్(England) కూడా ఘనంగా ఆరంభించింది. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రిటీష్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. హాడ్జ్ 41 పరుగులతో రాణించింది. బౌచీర్ 23 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 118 పరుగులే చేసింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 97 పరుగులకే పరిమితమైంది. మోస్త్రే 44 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా బంగ్లాకు విజయం దక్కలేదు. కెప్టెన్ నగర్ సుల్తానా 15 పరుగులు చేసి కాస్త పోరాడినా అది సరిపోలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా విజయానికి 21 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలలో లిన్సే స్మిత్ నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిలో కీలకపాత్ర పోషించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
క్రైమ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement