Women’s T20 World Cup 2023: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఉత్తమ జట్టును ఎంపిక చేసిన ఐసీసీ- భారత్ నుంచి ఒకరికి చోటు
Women’s T20 World Cup 2023: ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారితో మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది.
Women’s T20 World Cup 2023: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం రాత్రి న్యూలాండ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇది ఆసీస్ జట్టుకు ఆరో ప్రపంచకప్ టైటిల్.
నేడు ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారితో మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో నలుగురు ఆస్ట్రేలియన్లకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు ఉన్నారు. భారత్ నుంచి ఒకరికి మాత్రమే చోటు దక్కింది. ఇంగ్లండ్ కు చెందిన నాట్- స్కివర్ బ్రంట్ కెప్టెన్ గా ఎంపికైంది. ఐర్లాండ్ ప్లేయర్ ఓర్లా ప్రెండర్ గస్ట్ 12వ క్రీడాకారిణిగా స్థానం దక్కించుకుంది.
ఐసీసీ అత్యంత విలువైన జట్టు
- తజ్మిన్ బ్రిట్స్
- అలీసా హీలీ (వికెట్ కీపర్)
- లారా వాల్వర్డ్ట్
- నాట్- స్కివర్ బ్రంట్ (కెప్టెన్)
- యాష్ గార్డెనర్
- రిచా ఘోష్
- సోఫీ ఎక్లెస్టోన్
- కరిష్మా రామ్ హరాక్
- షబ్మిన్ ఇస్మాయిల్
- డార్సీ బ్రౌన్
- మేఘన్ స్కట్
- ఓర్లా ప్రెండర్ గస్ట్
How strong is this team?! 😲
— ICC (@ICC) February 27, 2023
The @upstox Most Valuable Team from the ICC Women's #T20WorldCup is out! 👀
More 👉 https://t.co/06BcjMDZLP pic.twitter.com/PwqcpYgshL
ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ మహిళల జట్టు ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళల జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి ఆరో సారి టీ20 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది ఇందులో బెత్ మూనీ 74 పరుగులతో ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడింది.
157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. తొలి 6 ఓవర్లలో జట్టు కేవలం 22 పరుగులు మాత్రమే జోడించగలిగింది. తాజ్మీన్ బ్రిట్స్ రూపంలో జట్టు ఒక ముఖ్యమైన వికెట్ కూడా కోల్పోయింది. దీని తర్వాత లారా వోల్వార్డ్ట్, ఒక ఎండ్‌లో దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే లారా 61 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో, దక్షిణాఫ్రికా విజయపు ఆశలు కూడా ముగిసిపోయాయి. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 137 పరుగుల స్కోరును మాత్రమే చేరుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలవగలదని అందరూ భావిస్తున్న తరుణంలో అదే సమయంలో వోల్వార్డ్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మేగాన్ షుట్ వ్యక్తిగత స్కోరు అవుట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది.
🔹 Formidable
— ICC (@ICC) February 26, 2023
🔹 Indomitable
🔹 The Greatest
Praise is being heaped on Meg Lanning’s triumphant Australia side ⬇️#AUSvSA | #T20WorldCup | #TurnItUphttps://t.co/ElSGDdzUu6
Ash Gardner stands and delivers!
— ICC (@ICC) February 26, 2023
This moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup. pic.twitter.com/I7jnHilJAZ