అన్వేషించండి
Advertisement
India vs Afghanistan: తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం, అఫ్గాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
IND vs AFG 1st T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ నేడు మొహాలీ వేదికగా తొలిమ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే ఈ తొలి టీ20 మ్యాచ్‌కు కింగ్ కోహ్లీ దూరమయ్యాడు.
మూడు టీ20ల సిరీస్(T20 Series)లో భాగంగా నేడు మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్(Afghanistan)తో తొలిమ్యాచ్‌లో భారత్ (Bharat)తలపడనుంది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup)కంటే ముందు భారత్ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ(Rohit Warma), విరాట్ కోహ్లీ(Virat Kohli)పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ నేడు మొహాలీ వేదికగా తొలిమ్యాచ్‌లో తలపడనున్నాయి. 14 నెలల విరామం తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్‌కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడంతో అందరి దృష్టివారిపైనే నెలకొంది. అయితే ఈ తొలి టీ20 మ్యాచ్‌కు కింగ్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల అఫ్గాన్‌తో తొలి టీ20లో కోహ్లి ఆడట్లేదని... రెండు, మూడు టీ20ల్లో అతను బరిలో దిగుతాడని ద్రవిడ్ పేర్కొన్నాడు.
అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్‌కు వచ్చినా... గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించారు. గాయం కారణంగా రషీద్ బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. రషీద్ వన్డే వరల్డ్‌కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్నాడు.
14 నెలల విరామం తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్‌కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడంతో అందరి దృష్టివారిపైనే నెలకొంది. అయితే కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అభిమానులు నిరాశ చెందారు . ఈ సిరీస్‌కు వారిని ఎంపిక చేయడం ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వారు ఉంటారని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యారు. రోహిత్ శర్మతోకలిసి భారత ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్ లేదా యశస్వీ జైశ్వాల్ ఆరంభించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్ గిల్ అఫ్గానిస్తాన్‌పై సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్‌ఆర్డర్‌లో రింకూ సింగ్ కీలకంకానున్నాడు. వికెట్‌కీపర్‌గా జితేశ్ శర్మకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కింద శివమ్ దుబే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కింద అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అర్షదీప్, అవేశ్‌ఖాన్, ముఖేష్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కులదీప్ యాదవ్ లేదా రవిబిష్ణోయ్‌కు తుదిజట్టులో స్థానం దక్కవచ్చు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా రివ్యూ
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement