అన్వేషించండి
New Zealand cricket: ఎవరీ అజాజ్ పటేల్, ఎక్కడి వాడు, ఏం సాధించాడు?
Ajaz Patel: న్యూజిలాండ్ జట్టు తరపున క్రికెట్ ఆడుతున్న అజాజ్ జన్మించింది, ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది అంతా భారత్ లోనే.
![New Zealand cricket: ఎవరీ అజాజ్ పటేల్, ఎక్కడి వాడు, ఏం సాధించాడు? Who is Ajaz Patel what gimmick did he play against Indian team New Zealand cricket: ఎవరీ అజాజ్ పటేల్, ఎక్కడి వాడు, ఏం సాధించాడు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/18/9790bd5f882b3ff6901b887467ca957217266653214331036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతీయ మూలాలు ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్
Source : Twitter
Who is Ajaz Patel: న్యూజిలాండ్(New Zealand )-శ్రీలంక(Srilanka) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఓ స్పిన్నర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆ న్యూజిలాండ్ స్పిన్నర్... శ్రీలంక పిచ్ లపై ప్రభావం చూపుతాడని అంతా భావిస్తున్నారు. కివీస్ ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌లలో ఒకడైన ఆ స్పిన్నరే అజాజ్ పటేల్( Ajaz Patel). కివీస్ జట్టులో నాణ్యమైన బౌలర్లు చాలామంది ఉన్నా.. అందరి చూపు మాత్రం అజాజ్ పటేల్ పైనే ఉంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథానాన్ని తెలుసుకోవాల్సిందే.
ఎవరీ అజాజ్ పటేల్..?
అజాజ్ పటేల్ న్యూజిలాండ్ జట్టు తరపున క్రికెట్ ఆడుతున్నాడు. కానీ అజాజ్ జన్మించింది.. ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది అంతా భారత్ లోనే. అజాజ్ పటేల్ 21 అక్టోబర్ 1988న ముంబైలో జన్మించాడు. అజాజ్ మౌంట్ మేరీ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.అజాజ్ కు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతని కుటుంబం మొత్తం 1996లో న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది. అజాజ్ తండ్రి పేరు యూనస్ పటేల్. తల్లి పేరు షహనాజ్ పటేల్. అజాజ్ పటేల్ కు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. ఒకరి పేరు సనా పటేల్ కాగా, మరొకరి పేరు తంజీల్ పటేల్.
ముంబై నుంచి కివీస్ కు...
క్రికెటర్ గా అజాజ్ పటేల్ వేగంగా ఎదిగాడు. భారత్ అంటేనే స్పిన్ కు పుట్టినిల్లు. అలాంటి భారత్ లో పుట్టిన అజాజ్ కు స్పిన్ బాగానే వంట పట్టింది. 2021లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.
పేస్ నుంచి స్పిన్ కు...
అజాజ్ పటేల్ తన క్రికెట్ కెరీర్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు. న్యూజిలాండ్ దేశవాళీ పోటీల్లో ఆక్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ దీపక్ పటేల్ నుంచి అజాజ్ కు మంచి ప్రోత్సాహం లభించింది. అజాజ్ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్ తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 27 డిసెంబర్ 2015న లిస్ట్-A మ్యాచుల్లోకి అరంగేట్రం చేశాడు. 2021 సంవత్సరంలో అజాజ్ అద్భుతమైన ఫీట్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టుకు ఆడుతూ.. టీమిండియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతం చేసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం
అజాజ్ పటేల్ 2018లో పాకిస్తాన్‌తో T-20 మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే 35 ఏళ్ల అజాజ్ పటేల్ ఉప ఖండం పిచ్ లపై మెరుగ్గా రాణిస్తున్నా న్యూజిలాండ్ లో మాత్రం తేలిపోతున్నాడు. అయితే స్పిన్కు అనుకూలించే పిచ్ లపై అజాజ్ చెలరేగిపోతాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion