అన్వేషించండి
Advertisement
INDvsAFG 3rd T20I: పాకిస్థాన్ రికార్డు బ్రేక్, అగ్రస్థానం భారత్‌దే
INDvsAFG 3rd T20I: అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది.
అఫ్గానిస్థాన్(Afghanistan)తో జరిగిన నామమాత్రమైన మూడో టీ 20లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో చివరికి విజయం భారత్‌నే వరించింది. తొలుత రోహిత్- రింకూ (Rinku, Rohit)పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అఫ్గాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా అది కూడా టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేయగా భారత్ కూడా 16 పరుగులే చేసింది. మరోసారి సూపర్ ఓవర్ పెట్టగా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ బ్యాటర్లను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్ కథ ముగిసింది. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే జట్టు ఇన్నింగ్స్ ముగిసినట్లే. అందుకే మరో మూడు బంతులు మిగిలి ఉండగానే అఫ్గాన్ కథ ముగిసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. అంతేకాకుండా మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇలా క్లీన్‌స్వీప్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
భారత జట్టు కొత్త చరిత్ర
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది.
రోహిత్-రింకూ చరిత్ర
అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో... టీమిండియా సారధి రోహిత్‌శర్మ-నయా ఫినిషర్ రింకూ సింగ్ కొత్త రికార్డు సృష్టించారు. అఫ్గాన్ బౌలర్లను చీల్చి చెండాడిన వీళ్లిద్దరూ అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో రోహిత్ చెలరేగగా... అజేయ అర్థ శతకంతో రింకూ తన ఎంతటి విలువైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ నెలకొల్పిన అజేయమైన 190 పరుగుల భాగస్వామ్యం... అంతర్జాతీయ టీ20లలో భారత్‌కు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. 190 పరుగుల భాగస్వామ్యంతో రోహిత్-రింకూ టీ 20 క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు సంజు శాంసన్-దీపక్ హుడా పేరున ఉంది. 2022లో ఐర్లాండ్‌పై సంజూ శాంసన్- దీపక్ హుడా జోడి 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ రికార్డును రోహిత్ శర్మ-రింకూసింగ్ జోడీ బద్దలు కొట్టింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement