MS Dhoni Angry: కెప్టెన్ కూల్- చాలా యాంగ్రీ గురూ - ధోనీ గురించి తోటి ఆటగాడు ఏం చెప్పాడంటే!
MS Dhoni: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి చెప్పాలంటే మొదటి మాట మిస్టర్ కూల్ అనే మాటే వాడుతాం. కానీ ధోనీ కి కూడా కోపం వస్తుందంట .ఈ విషయాన్ని సీఎస్‌కే మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ బయట చెప్పారు.
Badrinath recalled MS Dhoni’s Angry Moment: ఎంఎస్ ధోని(MS Dhoni) గ్రౌండ్లోకి వచ్చాడంటే చాలా కూల్గా ఉంటాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుంటాడని మనకు తెలిసిందే. మ్యాచ్ సమయంలో సహచర ఆటగాళ్లపై కోప్పడిన సందర్భాలు బహుశా తక్కువే అని చెప్పాలి. అందుకు చాలా మంది ఆటగాళ్ల ధోని పై చూపే అభిమానమే నిదర్శనం. జట్టును ప్రతి సమయంలో ముందు ఉండి నడిపాడు కాబట్టే భారత్ టీ20, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించి పెట్టి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. అలాగే ఐపీఎల్లో సీఎస్కేకు 5 టైటిళ్లను తీసుకోచ్చాడు. అయితే ఓ వీడియో నెట్టింట్లో ధోనీ గురించి వైరల్ అవుతోంది. అదేంటంటే..
కోపంతో బాటిల్ను తన్నేశాడు...
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ గురించి మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే "ధోనీ కూడా మామూలు మనిషే. అతనూ చాలా అరుదుగా కోప్పడుతుంటాడు. కానీ,గ్రౌండ్లోకి దిగాడంటే అతనిలో కోపం చాలా రేర్ గా చూస్తుంటాం. కోపంగా ఉన్న సమయంలో తను ఆడతానికి గానీ, నిర్ణయం తీసుకోవటానికి గానే ఇబ్బంది పడతాడు అని ప్రత్యర్థులు అనుకోకూడదని ధోనీ ఆలోచన. కానీ ఐపీఎల్ ప్రారంభంలో ఆర్‌సీబీతో మ్యాచ్ సందర్భంగా ధోనీ చాలా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అతని కోపాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అయితే ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగింది. చెన్నై వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో మేం 110 పరుగుల లక్ష్యచేధనకు దిగాం. కానీ స్వల్ప వ్యవధిలోనే చకచకా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో ఓడిపోయాం. అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో షాట్ ఆడబోయి నేను కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాను. డ్రెస్సింగ్ రూమ్ పక్కనే నిల్చోని ఉన్నా. కప్టెన్ ధోనీ అక్కడికి వస్తున్నాడు. వస్తూ వస్తూ అక్కడే ఉన్న ఓ చిన్న వాటర్ బాటిల్‌ను చాలా కోపంతో తన్నేశాడు. నాకు చాలా భయమేసింది. అతని కళ్లల్లోకి చూసేందుకు కూడా భయపడ్డాను. నేనే కాదు జట్టు సభ్యులు మొత్తం చాలాసమయం వరకు అసలు ధోనీ ముఖం చూడానేలేదు" అని బద్రీనాథ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ధోనీ గురించి ఆసక్తికర విషయాలు, డ్రెస్సింగ్ రూం సంగతులు పంచుకున్నారు.
2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2024లో కెప్టన్సీ నుంచి వైదొలిగి ఆటగాడిగా మారాడు. ఫినిషర్‌గా అభిమానులను అలరించాడు. సీఎస్‌కే వికెట్లు పడిపోయినా అభిమానులు మ్యాచ్ పోతుంది అని బాధపడకుండా ధోనీ గురించి ఎదురు చూసారంటే ధోనీ క్రేజ్ ఊహించవచ్చు. అయితే ఐపీఎల్ 2025లో అతడు ఆడతాడా? లేదో? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..