David Warner: హాలీవుడ్ హీరో రేంజ్‌లో, హెలికాఫ్టర్‌లో డేవిడ్ భాయ్ ఏంట్రీ
David Warner: బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్‌లో డైరెక్ట్‌గా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ల్యాండ్ అయ్యాడు.
బిగ్‌బాష్ లీగ్ (BBL 2024) మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా(Austrelia) స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రైవేట్ హెలికాప్టర్( Helicopter)లో డైరెక్ట్‌గా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన వార్నర్ నేరుగా.. తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో హాలివుడ్ హీరో రేంజ్‌లో అడుగుపెట్టాడు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు.
హాలీవుడ్ హీరో రేంజ్‌లో...
నేడు సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్ ఉంది. ఇదే రోజు ఉదయాన్నే హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెళ్లి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హంటర్ వ్యాలీకి మధ్య 250 కిలోమీటర్ల దూరం ఉంది. దాంతో, వివాహ వేడుక వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బయలుదేరాడు. ప్రేక్షకులను అనుమతించడానికి ముందే వార్నర్ స్టేడియానికి చేరుకున్నాడు. హంటర్ వ్యాలీప్రాంతంలో సోదరుడి పెళ్లి వేడుకలో పాల్గొన్న వార్నర్.. అక్కడినుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మైదానానికి చేరుకున్నాడు.
Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥
— Johns. (@CricCrazyJohns) January 12, 2024
- What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954
రెండేళ్ల ఒప్పందం
బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ గతేడాది సిడ్నీ థండర్స్ రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌తో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అవనుంది. అయితే డొమెస్టిక్ లీగ్‌లో ఆడతానంటూ వార్నర్ ఇటీవల పేర్కొనడం వల్ల వచ్చే సీజన్‌లోనూ అతడిని చూడవచ్చు. బీబీఎల్ మ్యాచ్‌ల అనంతరం ఇంటర్నేషనల్ టీ20 లీగ్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నాడు. అక్కడ డేవిడ్ భాయ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టుతో కలువనున్నాడు. ఈ స్టార్ ఆటగాడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే చాన్స్ ఉంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ పొట్టి సిరీస్ జరుగనుంది.
రిటైర్ తర్వాత ప్లాన్ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడతానని ఇప్పటికే ప్రకటించిన వార్నర్.. ఫ్యూచర్ ప్లాన్స్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో కోచ్‌గా కూడా వచ్చే అవకాశముందని, తనకూ ఆ ఆసక్తి ఉందని వార్నర్ తెలిపాడు. భవిష్యత్తులో క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తానని వార్నర్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత ఫాక్స్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నేను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉందని... భవిష్యత్తులో తన ఆశయం కూడా అదేనని అన్నాడు. దీని గురించి ఇప్పటికే తన భార్యతో మాట్లాడానని వార్నర్ తెలిపాడు. ‘అవును. నేను ఫ్యూచర్‌లో కోచ్‌గా రావాలనుకుంటున్నాను. అయితే నా భార్యను అనుమతి అడగాలి. కోచ్‌గా ఉండాలంటే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా.. అందుకే ఆమె అనుమతి తప్పనిసరి..’ అంటూ వార్నర్ ఫన్నీగా వ్యాఖ్యానించాడు.