Virat Kohli: కోహ్లీ ఆ టాటూని కాపీ కొట్టినవాళ్ళు ఇది విన్నారా! విరాట్ మాటలు వింటే షాక్
Virat Kohli first tattoo Story: కోహ్లీ ఆటకే కాదు గ్లామర్ కి, ఫిట్నెస్ కి, టాటూలకి కూడా ఫాన్స్ ఉన్నారు. అభిమానులు కోహ్లీ హెయిర్ స్టైల్ ని, టాటూలని ఇమిటేట్ చేస్తారు. కానీ ఈ టాటూ విషయంలో మాత్రం..
Virat Kohli Revealed A Hilarious Story Behind His First Tattoo: భారతదేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ ఒకడని మనకి తెలిసిందే. ఇక విరాట్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో టాటూలు అంటే కూడా అంతే ఇష్టం. ఈ రన్ మెషీన్ ఒంటిపై మొత్తం 12 టాటూలను ఉన్నాయి. వాటికి ప్రత్యేకమైన అర్థాలు, వాటి వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. విరాట్ చాలాసార్లు ఆ విషయాన్ని స్వయంగా చెప్పాడు.
విరాట్ శరీరంమీద అతని రాశిచక్రం, అతని తల్లిదండ్రుల పేర్లు, అతని వన్డే నంబర్, శివుడు ఇలా ఒక్కొకటి ఒక్కో అంశాన్ని సూచిస్తాయి. అయితే, అతని మొదటి టాటూ వెనుక ఒక ఫన్నీ స్టోరీ ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే విరాట్ తన మొదటి టాటూను 2007 సంవత్సరంలో వేయించుకున్నాడు. దీని గురించి మాట్లాడుతూ, విరాట్ బెంగుళూరులోని MG రోడ్‌లోని టాటూ స్టూడియోలో కనపడగానే తనకి టాటూ వేసుకోవాలనిపించిందని, అప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఒక డిజైన్ చూసి తన కుడి మోచేతిపై ఒక గిరిజన డిజైన్‌ను టాటూగా వేయించుకున్నాడని చెప్పాడు.
అసలు టాటూ ప్రాముఖ్యత గురించి తాను ఆలోచించలేదని, కానీ చాలా కాలం తరువాత, ఆ టాటూ అర్థం తెలిసిందన్నాడు. ఆ టాటూలో f లెటర్ ఉంటుందని, దాని అర్థం ఫెయిత్ గా చెప్పుకొని కవర్ చేసుకున్నానన్నాడు. అయితే ఆ విషయం తెలియక అదే టాటూని కాపీ కొట్టిన తన అభిమానుల పట్ల జాలి, బాధ కూడా కలుగుతుందన్నాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఆ పచ్చబొట్టును అలాగే ఉంచుకున్నానని, అయితే ఆ తరువాత దానిని వేరేరకంగా మార్చుకున్నానని చెప్పాడు.
Young Virat vs. Virat Nowpic.twitter.com/1CtEfyFyUh
— RVCJ Media (@RVCJ_FB) May 31, 2024
విరాట్ కోహ్లీ ఎడమ మోచేతిపై శివుడి టాటూ ఉంది మానసరోవర్ సరస్సుతో కైలాస పర్వతంపై శివుడు ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తాడు ఈ టాటూలో. కుడి బిసిప్స్ పై వృశ్చికరాశి (Scorpio) అని ఉంటుంది. అది తన జన్మ రాశి. ఇంకో ప్లేస్ లో కోహ్లీ తల్లిదండ్రుల పేర్లు. ఒక మానిస్టర్ టాటూ, జపనీస్ సమురాయ్, భగవంతుని కన్నుగా భావించే ఓ కన్ను, ఓంకారం, అలాగే తనపై 175 మరియు 269 నంబర్లను టాటూగా వేయించుకున్నాడు. ఇవి అతని కెరీర్‌లో రెండు ముఖ్యమైన మైలురాళ్లను సూచిస్తాయి. 2018లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. ఆ రోజు ఆడిన 175వ భారత క్రికెటర్. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతను ఆడిన క్రమాన్ని నంబర్ 269 సూచిస్తుంది.
ప్రస్తుతానికి టీ 20 వరల్డ్ లో కీలక పాత్ర పోషించనున్న ఈ స్టార్ క్రికెటర్ న్యూయార్క్ చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి గతంలో కూడా అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఈ టోర్నీలో 25 ఇన్నింగ్స్‌లలో ఆడి 81.50 సగటుతో 1,141 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే 131.30 స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89 (నాటౌట్). టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు కూడా కోహ్లీయే.