News
News
X

Virushka Marriage Anniversary: జీవితాంతం చేయబోయే ప్రయాణంలో ఐదేళ్లు పూర్తయ్యాయి- అనుష్కపై విరాట్ పోస్ట్

Virushka Marriage Anniversary: అనుష్కతో పెళ్లి జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.  ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది.

FOLLOW US: 
Share:

Virushka Marriage Anniversary:  నేడు (డిసెంబర్ 11) భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహ వార్షికోత్సవం. ఈ రోజుతో వారి పెళ్లి జరిగి 5 సంవత్సరాలు పూర్తవుతోంది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. అనుష్కతో పెళ్లి జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 

'నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి జీవితాంతం చేయబోయే ప్రయాణానికి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నాపై ఉన్న ఆశీస్సుల ఫలితంగానే నిన్ను నా జీవితంలో పొందగలిగాను' అంటూ భార్యపై ప్రేమను చాటాడు విరాట్. దీనికి అనుష్క సరదాగా స్పందించిది. 'ఇంకా నయం నువ్వు ముందుగా చెప్పాలనుకున్నది పోస్ట్ చేయలేదు' అంటూ బదులిచ్చింది. ఈ సందర్భంగా వీరివురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ పోస్ట్ పెట్టిన 2 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది. 

తన భార్య అనుష్క శర్మపై ఉన్న ప్రేమను కోహ్లీ సమయం వచ్చినప్పుడల్లా చూపిస్తూనే ఉంటాడు. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పెడుతుంటాడు. అలాగే తాను ఫాం కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు అనుష్క తనకు చాలా సపోర్ట్ గా నిలిచిందని చాలా సందర్భాల్లో విరాట్ చెప్పాడు. వీరి జంటకు వామిక అనే పాప ఉంది. 

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

బంగ్లాతో టెస్టులకు సిద్ధమైన కోహ్లీ

ఇకపోతే విరాట్ కోహ్లీ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నాడు. డిసెంబర్ 14 నుంచి బంగ్లాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు. ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 1-2తో కోల్పోయింది. మొదటి రెండు మ్యాచులు బంగ్లాదేశ్ గెలవగా... చివరిదైన ఆఖరి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఇది విరాట్ కు 71వ శతకం. దీంతో అత్యధిక శతకాలు చేసిన వారిలో రెండో స్థానానికి చేరాడు. మొదటి స్థానంలో 100 సెంచరీలతో భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా వెటరన్ రికీ పాంటింగ్ (70) నిలిచాడు. 

Published at : 11 Dec 2022 10:29 PM (IST) Tags: Virat Kohli Anushka Sharma Virat Kohli Marriage Anniversay Virat Kohli post on Anushka Kohli insta post on Anushka Kohli Anushka Marriage Anniversary

సంబంధిత కథనాలు

IND vs AUS: ఇది లవ్లీ సిరీస్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఏమన్నాడంటే?

IND vs AUS: ఇది లవ్లీ సిరీస్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఏమన్నాడంటే?

IND vs AUS 1st Test: 'తొలిరోజు నుంచే బంతి స్పిన్ అయ్యే పిచ్ కావాలి- తుది జట్టులో ఎవరుండాలంటే!'

IND vs AUS 1st Test: 'తొలిరోజు నుంచే బంతి స్పిన్ అయ్యే పిచ్ కావాలి- తుది జట్టులో ఎవరుండాలంటే!'

Border Gavaskar Trophy: రేపే బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్రారంభం- ఈ ట్రోఫీలో టాప్- 10 విశేషాలు చూసేద్దామా! 

Border Gavaskar Trophy: రేపే బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్రారంభం- ఈ ట్రోఫీలో టాప్- 10 విశేషాలు చూసేద్దామా! 

Virat Kohli’s New Phone: విరాట్ కోహ్లీ కొత్త ఫోన్ పోయిందట- నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా!

Virat Kohli’s New Phone: విరాట్ కోహ్లీ కొత్త ఫోన్ పోయిందట- నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా!

Aaron Finch Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్ - ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా రికార్డు

Aaron Finch Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్ - ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా రికార్డు

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్