Virat In Ranji Trophy: రంజీల్లోనూ నిరాశ పర్చిన కోహ్లీ.. ఈసారి క్లీన్ బౌల్డ్ (వీడియో)
15 బంతులు ఆడిన కోహ్లీ.. ఒక అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ తో మంచి టచ్ లో కనిపించాడు. అయితే హిమాన్షు సాంగ్వాన్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీ.. బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను ఎగురవేసింది.

Virat Kohli News: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీల్లోనూ నిరాశ పర్చాడు. తాజాగా రైల్వేస్ తో జరిగుతున్న గ్రూపు మ్యాచ్ లో కేవలం ఆరు పరుగులకే వెనుదిరిగాడు. దీంతో అతని ఆటను చూద్దామని వచ్చిన వేలాది మంది అభిమానులు నిరాశకు లోనయ్యారు. 15 బంతులు ఆడిన కోహ్లీ.. ఒక అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ తో మంచి టచ్ లో కనిపించాడు. అయితే హిమాన్షు సాంగ్వాన్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీ.. బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను ఎగురవేసింది. దీంతో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కోహ్లీ వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ సాంగ్వాన్ రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నాడు. తనలోని అగ్రెషన్ మొత్తాన్ని బయటపెట్టాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు లైకులు, షేర్లతో స్పందిస్తూ తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.
What A knock by virat kohli another failure
— Narendra Kumar (@Narendr35) January 31, 2025
Virat kohli
Kingkohli pic.twitter.com/pD2UQ2E3Sz
ఉదయం నుంచే వెయింటింగ్..
నిజానికి కోహ్లీ బ్యాటింగ్ చూడటానికి అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. త్వరగా వికెట్ పడితే కోహ్లీ బ్యాటింగ్ కోసం క్రీజులోకి వస్తాడని కోరుకున్నారు. వారు కోరుకున్న విధంగానే క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. పట్టుమని 15 బంతులకు మించి ఆడలేకపోయాడు. అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయి నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో పదే పదే ఆఫ్ స్టంప్ ఆవతల పడిన బంతికి ఔటైనా కోహ్లీ.. ఈసారి మాత్రం క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ఇక గురువారం ప్రారంభమైన ఈ రంజీ మ్యాచ్ లో తొలి రోజు 15వేల మందికిపైగా అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఒక రంజీ మ్యాచ్ కు ఈ లెవల్లో రావడం కోహ్లీ క్రేజును చూపిస్తోంది. మిగతా భారత స్టార్లు రంజీలలో ఆడుతున్న ఈ స్థాయిలో అభిమానులు రావడం లేదు.
కట్టుదిట్టమైన భద్రత..
అభిమానులు బాగా రావడంతో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ).. కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంది. తొక్కిసలాట జరుగకుండా అందుబాటులో ఉన్న గేట్లను తెరిచింది. అలాగే భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే గురువారం ఎంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, ఒక ఫ్యాన్ మైదానంలోకి వచ్చి కోహ్లీకి పాదాభివందనం చేశాడు. దీంతో తేరకున్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అతనితో కాస్త స్మూత్ గా వ్యవహరించాలని, కఠిన చర్యలు తీసుకోవద్దని సెక్యూరిటీకి సిబ్బందికి కోహ్లీ రిక్వెస్టు చేశాడు.
మరోవైపు దేశవాళీల్లో ఆడాలంటూ బీసీసీఐ రూల్ పెట్టడంలో భారత స్టార్లు తమ జట్ల తరపున రంజీల్లో ఆడుతున్నరు. ముంబై తరపున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, డిల్లీ తరపున కోహ్లీ, రిషభ్ పంత్, కర్ణాటక తరపున కేఎల్ రాహుల్, ప్రసిధ్, తమిళనాడు తరపున వాషింగ్టన్ సుందర్, పంజాబ్ తరపున శుభమాన్ గిల్ తదితరులు బరిలోకి దిగుతున్నారు.


















