By: ABP Desam | Updated at : 12 Aug 2023 05:01 PM (IST)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ
Virat Kohli Income: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడినా..ఆడకపోయినా ఆయన ప్రత్యేకత వేరు. క్రికెట్ రికార్డులును తిరగ రాయాలంటే అది కేవలం కోహ్లీకే చెల్లింది. కోహ్లీ క్రీజ్ లో ఉంటేనే ఆట చూస్తాం అనే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తమ కుటుంబ సభ్యులు క్రికెట్ ఆడుతున్నప్పటికీ కోహ్లీ ఆట చూసేవారు చాలా మంది ఉన్నారు. కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ లెవల్లో ఉంది. ఒక్క పోస్ట్ చేస్తే చాలు. నిమిషాల్లో వేల లైకులు వచ్చేస్తాయి. దానితో పాటు కోట్లలో డబ్బులు కూడా వస్తాయనేది చాలా మంది వాదన.
అయితే ఇది ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియదు. ఓ సర్వే వారు అయితే ఇన్ స్టా లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ గానే కాకుండా ఇన్ స్టా ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తి కోహ్లీ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కోహ్లీ కంటే ముందు కొంత మంది ఉన్నారు. వారు ఎవరంటే స్టార్ ఫుట్ బాల్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, రొనాల్డో ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదించే వ్యక్తుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.
వారి తరువాత కోహ్లీ ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి కోహ్లీ స్పందించాడు. ఆ వార్తలలో నిజం లేదని ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీని 256 మిలియన్లకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే ఇన్ స్టా లో కోహ్లీ పోస్ట్ చేసే ప్రతి పోస్ట్‌కు రూ.11.45 కోట్లు సంపాదిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
గతేడాది కోహ్లీ ఇన్ స్టా ద్వారా రూ.3.25 కోట్లు సంపాదిస్తే..ఇప్పుడు అది భారీగా పెరిగిందని టాక్ కానీ మరీ 11 కోట్ల రూపాయలు తీసుకోవడం లేదనేది కోహ్లీ మాట. ప్రపంచ వ్యాప్తంగా 600 మిలియన్లను కలిగి ఉన్న రొనాల్డో ఒక ఇన్ స్టా పోస్ట్ కు 26. 7 కోట్లను సంపాదిస్తుంటే..ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఒక పోస్ట్ కు 21.5 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇండియాలో కోహ్లీనే అధికంగా సంపాదిస్తున్నట్లు సమాచారం.
కోహ్లీ మాత్రం తాను 11 కోట్లు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు కానీ ఎంత సంపాదిస్తున్నాడు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఇకపోతే కోహ్లీ తర్వాత ఇండియాలో ఎక్కువగా సంపాదిస్తున్నది మాత్రం నటి ప్రియాంక చోప్రా. ఆమె ఒక పోస్ట్ కు రూ.4.4 కోట్లు ఛార్జ్ చేస్తుంది.
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?
Australia squad: ఆసీస్ ప్రపంచకప్ టీమ్‌లో మార్పు! భీకర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ వచ్చేశాడు!
World Cup 2023: టీమ్ఇండియా వరల్డ్ కప్ జట్టులో మార్పులు- అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్లో అత్యధిక ఓపెనింగ్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
/body>