అన్వేషించండి
Advertisement
Virat Kohli: ఇంత సాధిస్తానని అనుకోలేదు, కింగ్ కోహ్లీ భావోద్వేగం
ODI World Cup 2023: తన 35వ జన్మదినం సందర్భంగా తన క్రికెట్ ప్రయాణం గురించి కోహ్లీ స్పందించాడు. ఇన్నేళ్ల తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు
Virat Kohli Emotion: విరాట్ కోహ్లీ.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఆల్ టైం గ్రేట్స్ జాబితాలో ఒకడిగా ఖ్యాతి గడించాడు.భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఒక శతకం, మూడు అర్ధ సెంచరీలతో సత్తాచాటాడు. ఈ ప్రపంచకప్‌లోనే సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మరో సెంచరీ సాధిస్తే వన్డేల్లో అత్యధిక శతకాల సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఈ నవంబర్ 5న కోహ్లీ 35వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు. అదే రోజున దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. అయితే తన 35వ జన్మదినం సందర్భంగా తన క్రికెట్ ప్రయాణం గురించి కోహ్లీ స్పందించాడు. ఇన్నేళ్ల తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. తన పుట్టినరోజు సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ క్రికెట్ ప్రయాణం, జట్టు సభ్యులతో అనుబంధం సహా చాలా విషయాలను పంచుకున్నాడు.
కలలు కన్నా....
తన దృష్టంతా ఎప్పుడూ జట్టు కోసం మంచి ప్రదర్శన కనబరచాలనే ఉంటుందని కోహ్లీ అన్నాడు. టీం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను మంచి ప్రదర్శన చేసి జట్టును విజయపథంలో నడిపించడంపైనే తన దృష్టి ఉంటుందని కోహ్లీ అన్నాడు. ఇలా జట్టుకు విజయాలు అందించేందుకా తను క్రమశిక్షణలో, జీవనశైలిలో చాలా మార్పులు చేసుకున్నానని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తనలో ఎప్పుడూ ఉత్సాహం ఉంటుందన్న విరాట్... ఆటపై తాను పూర్తి ఏకాగ్రతతో ఉంటానని అన్నాడు. అలా పూర్తి ఏకాగత్రతో క్రమశిక్షణతో ఆడడం వల్లే తాను ఇన్ని ఫలితాలు సాధించగలిగానని అన్నాడు. ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తే తన ప్రయత్నాలన్నీ గుర్తుస్తున్నాయని కోహ్లీ అన్నాడు. కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని విరాట్ కోహ్లి అన్నాడు. సుదీర్ఘ కెరీర్, ప్రదర్శనలతో దేవుడు ఆశీర్వదిస్తాడని.. ఇన్ని సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదని కోహ్లీ అన్నాడు. బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నానని. కానీ సరిగ్గా ఇలాగే జరుగుతుందని ఊహించలేదని గుర్తు చేసుకున్నాడు. కెరీర్ సాగుతున్న తీరు, మన ముందు జరిగే విషయాలు ముందస్తు ప్రణాళికతో జరగవని కోహ్లీ తెలిపాడు. 12 ఏళ్లలో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని అనుకోలేదని... జట్టు కోసం బాగా రాణించాలని.. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాలని భావించానని తెలిపాడు.
అంబరాన్ని అంటనున్న సంబరాలు
నవంబర్ ఐదో తేదీన విరాట్ 35వ పుట్టినరోజు జరుపుకోనుండగా.. కింగ్ కోహ్లి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. అదే రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ బర్త్‌డే వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మ్యాచ్ మధ్యలో సెలబ్రేషన్స్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తోంది. విరాట్ కోహ్లి పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు నిర్వహించాలని క్యాబ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోహ్లి ఫొటో ఉన్న 70 వేల ఫేస్ మాస్క్‌లను ప్రేక్షకులకు పంపిణీ చేయనున్నారు. మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి వచ్చే 70 వేల మంది ప్రేక్షకులకు విరాట్ ఫేస్ మాస్కులు ఇవ్వాలని క్యాబ్ నిర్ణయించడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మ్యాచ్ సమయంలో గ్రౌండ్ మొత్తం విరాట్ కోహ్లీ మాస్కులు వేసుకుని కనిపిస్తే ఆ కిక్కే వేరంటూ సంబరపడి పోతున్నారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా క్యాబ్ ఏర్పాటు చేయిస్తున్న కేక్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విరాట్ పుట్టినరోజు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా కేక్ డిజైన్ చేయిస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ వెల్లడించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement