Virat Kohli 100th Test: అత్యధిక టెస్టులాడిన టీమిండియా క్రికెటర్లు వీరే.. కోహ్లీకి అందనంత దూరంలో సచిన్
Virat Kohli 100th Test: సచిన్ టెండూల్కర్ 200 టెస్టులాడిన రికార్డు విరాట్ కోహ్లీకి అందనంత దూరంలో ఉంది. మరో మ్యాచ్ ఆడితే 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.
Virat Kohli 100th Test: శ్రీలంకతో మార్చి 4 నుంచి టీమిండియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు. జాతీయ జట్టుకు ఆడాలన్న కలతో పాటు ఆటగాళ్లకు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాలని ఉంటుంది. అలాంటిది కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 99 టెస్టులకు పరిమితం అయ్యాడు. మరో మ్యాచ్ ఆడితే అత్యధిక టెస్టులాడిన భారత క్రికెటర్ల జాబితాలో అజారుద్దీన్‌ను కోహ్లీ అదిగమిస్తాడు.
సచిన్ నెంబర్ వన్.. (100 Test Playing Indian Cricketers)
టీమిండియా నుంచి చూస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెస్టులతో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్స్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. భారత్ నుంచి ఇప్పటివరకూ 11 మంది ఆటగాళ్లు 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. విరాట్ కోహ్లీ, అజారుద్దీన్ 99 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. సచిన్ 200 టెస్టుల్లో 51 శతకాలతో 15,921 పరుగులు సాధించాడు. రాహుల్ ద్రావిడ్ 163, వీవీఎస్ లక్ష్మణ్ 134, అనిల్ కుంబ్లే 132, కపిల్ దేవ్ 131 టెస్టులతో టాప్ 5లో ఉన్నారు.
మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్ 125 టెస్టులు, దిలీప్ వెంగ్ సర్కార్ 116, సౌరవ్ గంగూలీ 113, పేసర్ ఇషాంత్ శర్మ 105, హర్భజన్ సింగ్ 103, వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టులు ఆడారు. మరో మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు పూర్తవుతుంది. కోహ్లీ 99 టెస్టుల్లో 27 శతకాల సాయంతో 7,962 రన్స్ చేశాడు.
Virat Kohli's 100th test match will have no restrictions. BCCI asks the state associations to open up on the basis of govt directives. It is as per the government norms: BCCI chief Sourav Ganguly to ANI
— ANI (@ANI) March 1, 2022
(File pic) pic.twitter.com/mkNhVK1lg1
టెస్టుల్లో టీమిండియా టాప్ స్కోరర్స్..
భారత ఆటగాళ్లలో పరుగుల విషయానికొస్తే 15,921 రన్స్‌తో సచిన్ నెంబర్ 1గా ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ (13265 పరుగులు), సునిల్ గవాస్కర్ (10122 పరుగులు), లక్ష్మణ్ (8781 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (8503) టాప్ 5 స్కోరర్స్‌గా ఉన్నారు. మరికొన్నేళ్లు కొనసాగుతాడు కనుక కోహ్లీకి సైతం టెస్టుల్లో 10 వేల పరుగుల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.
Also Read: Virat Kohli 100th Test: వందో టెస్టులో విరాట్ ఫోకస్ దేనిమీదంటే - గావస్కర్ ప్రిడిక్షన్
Also Read: Virat Kohli 100th Test: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ