అన్వేషించండి

U19 World Cup Winner Australia: ఫైనల్లో టీమిండియా మరో‘సారీ’ - అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా

U19 World Cup Winner Australia: అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో భారత్ ఛేజింగ్ లో తడబాటుకు లోను కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్ కు నిరాశే ఎదురైంది.

U19 World Cup 2024 Final Australia Beats India: ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్రపంచ‌ క‌ప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్‌ 19, 2023న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది.

254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు. 

ఆదిలోనే ఎదురుదెబ్బ, టాపార్డర్ విపలం..
ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ స్కోరు 3 రన్స్ వద్ద ఓపెనర్ కులకర్ణి (3) ఔటయ్యాడు. కల్లమ్ విడ్లర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 10 ఓవర్ల వికెట్ పడకుండా ఆదర్శ్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ (22 రన్స్) జాగ్రత్తపడ్డారు. బార్డ్‌మన్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టడంతో ముషీర్ ఖాన్ ఔటయ్యాడు. వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ ఉదయ్ శరణ్ ఫైనల్లో విఫలమయ్యాడు. 8 పరుగులకే నిష్క్రమించాడు. టోర్నీలో టాప్ 3 స్కోరర్లుగా ఉన్న భారత కుర్రాళ్లు ఫైనల్లో స్కోరు బోర్డును నడిపించేందుకు ఇబ్బంది పడ్డారు.

U19 World Cup Winner Australia: ఫైనల్లో టీమిండియా మరో‘సారీ’ - అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా
Photo: Twitter/ICC

సచిన్ దాస్ (9), ప్రియాన్షు మోలియా (9), అవినాష్ (0) ఔట్ కావడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. స్కోరు బోర్డును నడిపించే క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్  (47; 77 బంతుల్లో 4x4, 1x6) ఔటయ్యాడు. చివర్లో మురుగన్ అభిషేక్  (42; 46 బంతుల్లో 5x4, 1x6) రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. విడ్లర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఆసీస్ కెప్టెన్ హ్యూ వీబ్జెన్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. పాండే(2)ను స్ట్రీకర్ ఔట్ చేసి భారత ఇన్నింగ్స్‌ను ముగించడంతో 79 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అండర్ 19 వరల్డ్ కప్ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకుంది. 

టాస్ నెగ్గిన ఆసీస్, ఫస్ట్ బ్యాటింగ్.. 
అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్ లలో  7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55 ) , హ్యూ వీబ్జెన్ (48) , డిక్సన్ (42) ఓలివర్ (46) పరుగులతో రాణించారు. భారత  బౌలర్లలో  రాజ్ లింబానీ (3) వికెట్లు పడగొట్టగా, నమన్ తివారీ( 2) వికెట్లు తీశాడు.

ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్‌ 9సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget