Tim Southee Hat-Trick: భారత్‌పై కివీస్ పేసర్ టిమ్ సౌథీ హ్యాట్రిక్ - వీడియో చూశారా!
భారత్ తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3, 4, 5 బంతుల్లో వరుసగా మూడు వికెట్లు తీసి హాట్రిక్ సాధించాడు.
Tim Southee Hat-Trick: భారత్ తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3, 4, 5 బంతుల్లో వరుసగా హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ లను ఔట్ చేసి హాట్రిక్ సాధించాడు. ఇది సౌథీకి టీ20ల్లో రెండో హ్యాట్రిక్. దీంతో శ్రీలంక వెటరన్ లసింత్ మలింగ్ రికార్డును సమం చేశాడు. మలింగ 2016-2017 లో కొలంబోలో బంగ్లాదేశ్ పై... 2019 లో పల్లెకెలెలో న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. కివీస్ తో జరిగిన మ్యాచులో మలింగ 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు.
హ్యాట్రిక్ తీశాడిలా
ఆఖరి ఓవర్ మూడో బంతికి టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సౌథీ ఔట్ చేశాడు. ఫుల్లర్ డెలీవరీతో పాండ్యను ఔట్ చేశాడు. నాలుగో బంతికి దీపక్ హుడాను ఫెర్గూసన్ క్యాచ్ ద్వారా పెవిలియన్ పంపాడు. ఐదో బంతికి నీషమ్ పట్టిన ఒక చక్కని క్యాచ్ ద్వారా సుందర్ ఔటయ్యాడు. దీంతో సౌథీకి హ్యాట్రిక్ లభించింది.
భారత్ విజయం
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 టీమిండియా ఘన విజయం సాధించింది. కుర్రాళ్లు సమష్టిగా రాణించిన వేళ 65 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ను భువనేశ్వర్ తన పదునైన బౌలింగ్ తో కట్టడి చేశాడు. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ (0) ను ఔట్ చేశాడు. భువీకి తోడు సిరాజ్ కట్టుదిట్టంగా బంతులేయటంతో న్యూజిలాండ్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. పవర్ ప్లే ముగిసే సరికి 32 పరుగులు చేసింది.
డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాన్వే (25) ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చటంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (6 బంతుల్లో 12) ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి ప్రమాదకరంగా కనిపించాడు. అయితే అతడిని చాహల్ ఒక తెలివైన బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కివీస్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలవలేదు. డారిల్ మిచెల్ (10), జిమ్మీ నీషమ్ (0), మిచెల్ శాంట్నర్(2) త్వరత్వరగా ఔటయ్యారు. ఒక ఎండ్ లో విలియమ్సన్ (52 బంతుల్లో 61) కుదురుకున్నప్పటికీ నిదానంగా ఆడాడు. అతనికి సహకరించేవారు లేక కివీస్ ఓటమి పాలయ్యింది. చివరికి 126 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టగా... భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
#southeehattrick #timsouthee #INDvsNZ #Hattrick pic.twitter.com/b5CvYTWf2n
— JM Ali (@itsJMAli) November 20, 2022