Team Australia: బెస్ట్ టెస్ట్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా- భారత్ నుంచి ఇద్దరికి చోటు
Australia picksTest Team of the Year 2023: ఏడాది ముగుస్తున్న వేళ... 2023లో అద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును ప్రకటించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
Test Team of the Year for 2023: ఈ ఏడాది అంతర్జాతీయంగా అత్యుత్తమంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 2023 ఏడాది ముగుస్తున్న వేళ... 2023లో అద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును ప్రకటించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇందులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సహా వన్డే ప్రపంచకప్‌ను కూడా అందించిన పాట్ కమిన్స్‌కు ఈ ప్రపంచ టెస్ట్ జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించింది.
ఓపెనర్లుగా ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నేను ఎంచుకుంది. మిడిలార్డర్‌లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్‌లకు స్థానం కల్పించింది. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, అశ్విన్, కగిసో రబాడ, కమిన్స్, మాజీ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ సెలెక్ట్ అయ్యారు. అయితే భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఏ ఒక్క బ్యాటర్‌కు ఇందులో స్థానం దక్కలేదు. పేసర్లకు కూడా స్థానం దక్కలేదు. ఇద్దరు స్పిన్నర్లకు మాత్రమే చోటు దక్కింది. ఐర్లాండ్‌కు చెందిన లోర్కన్ టక్నర్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
బెస్ట్ టెస్ట్ జట్టు 2023 : ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, బ్రూక్, టక్నర్(వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), రబాడ, స్టువార్ట్ బ్రాడ్.
సొంతగడ్డపై ముగిసిన వార్నర్ శకం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సొంత మైదానంలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డేవిడ్ భాయ్... సొంత మైదానమైన మెల్‌బోర్న్‌లో చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఈ స్టార్ ఓపెనర్ భావోద్వేగానికి లోనయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన అనంతరం పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఈ స్టార్ క్రికెటర్ భావోద్వేగానికి లోనయ్యాడు. బ్యాట్ చూపిస్తూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న ఈ దిగ్గజ బ్యాటర్‌ను స్టాండ్స్‌లో కూర్చున్న ఫ్యాన్స్ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ అభినందించారు. డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో వార్నర్ తన బ్యాటింగ్ గ్లౌజ్‌లను ఓ అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఘటనలో వార్నర్ క్రికెట్ అభిమానులు ప్రశంసలతో ముచెత్తుతున్నారు.
ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన వార్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆరు పరుగులే చేశాడు. జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనున్న ఆసీస్-పాక్ మూడో టెస్టు తర్వాత వార్నర్ ఈ సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ముగించనున్నాడు. సొంత మైదానమైన మెల్‌బోర్న్‌లో ఈ లెఫ్ట్‌హ్యాండర్‌కు మంచి రికార్డే ఉంది. ఇక్కడ ఆడిన 18 ఇన్నింగ్స్‌లలో డేవిడ్ భాయ్ 50.66 సగటుతో 912 పరుగులు సాధించాడు.