అన్వేషించండి
India vs Afghanistan T20s: రోహిత్, కోహ్లీ వచ్చేశారు- అప్గానిస్తాన్‌తో టీ 20 జట్టులో చోటు
India squad for Afghanistan T20s: టీమిండియా సారధి రోహిత్ శర్మ.. కింగ్ కోహ్లీ టీ 20 జట్టులో కొనసాగుతారా అన్న ప్రశ్నలకు తెరపడింది.
![India vs Afghanistan T20s: రోహిత్, కోహ్లీ వచ్చేశారు- అప్గానిస్తాన్‌తో టీ 20 జట్టులో చోటు Team Indias squad for T20 series against Afghanistan announced India vs Afghanistan T20s: రోహిత్, కోహ్లీ వచ్చేశారు- అప్గానిస్తాన్‌తో టీ 20 జట్టులో చోటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/07/ee929be90f17efcbf0901fe84d54ebfc1704636941468872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team Indias squad for T20 series against Afghanistan announced
అనుమానాలకు తెరపడింది. టీమిండియా(Team India) సారధి రోహిత్ శర్మ(Rohit Sharma).. కింగ్ కోహ్లీ(Virat Kohli) టీ 20 జట్టులో కొనసాగుతారా అన్న ప్రశ్నలకు తెరపడింది. మరికొన్ని నెలల్లో టీ 20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అప్గానిస్తాన్(Afghanistan)తో జరిగే సిరీస్‌లో జట్టులో చోటు కల్పిస్తూ అగార్క్‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో వీరిద్దరూ చివరిగా ఆడారు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ వీరు ఆడే అవకాశం ఉంది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ద్వయాన్ని తిరిగి టీ20ల్లోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ , గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్ బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. , జితేష్ శర్మ , సంజు శాంసన్ వికెట్ కీపర్ కీపర్లుగా చోటు సంపాదించారు . యువ ఆటగాళ్లు శివమ్ దూబె ,వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్ బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఘన విజయం సాధించి కొత్త ఏడాదిలో శుభారంభం చేసిన టీమ్‌ఇండియా ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జవనరి 11 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.
అఫ్గాన్ కూడా సిద్ధం
టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి భారత్ లోకి అడుగుపెడుతుంది. జూన్ 11 న నుంచి 3 టీ20 ల సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ కు ఎంపిక చేసినా.. ఆడటం అనుమానంగా మారింది. గత నెలలో ఈ స్టార్ స్పిన్నర్ వెన్ను గాయంతో సర్జరీ చేయించుకున్నాడు. జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. జనవరి 11 న మొహాలీలో తొలి టీ20, 14 న ఇండోర్ లో రెండో టీ20, 17న బెంగళూరులో మూడో టీ20 జరుగుతాయి. ఈ టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది.
అఫ్గానిస్తాన్ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion