అన్వేషించండి

India Vs Bangladesh Test Toss: కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్న భారత్‌.. వర్షంతో మ్యాచ్‌ ఆలస్యం

India Vs Bangladesh 2nd Test: కాన్పూర్ టెస్టులో భారత్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి వర్షానికి అవుట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది.

India National Cricket Team Vs Bangladesh National Cricket Team :బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో మూడు రోజులు వరుణ ప్రతాపం ఉండనుంది. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 10 గంటలకు టాస్‌ వేశారు. భారత్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 1964 తర్వాత కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తొలి జట్టుగా  రోహిత్ సేన రికార్డు సృష్టించింది. అంతే కాదు భారత్‌లో 9ఏళ్ల తర్వాత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కూడా ఇదే. 2015లో చివరి సారి బెంగళూరులో సౌత్ ఆఫ్రికాపై భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్ 10న్నరకు మొదలైంది.

కాన్పూర్ టెస్టులో ఆలస్యంగా టాస్‌.. తొలి రోజు ఆటకు పెద్ద అడ్డంకిగా వరుణుడు:

            బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ కాన్పూర్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల్లో మూడు రోజులు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా తొలి రోజు ఉదయం టాస్ కూడా ఆలస్యం అయింది. తొలి రోజు మొత్తం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. పూర్తిగా చిత్తడిగా మారిన అవుట్‌ ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సాదారణంగా మ్యాచ్‌ ఉదయం 9న్నర గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా టాస్ కూడా వాయిదా పడూతూ 10 గంటలకు వేశారు. పది గంటల నుంచి రెండు గంటల పాటు వర్షం కురుస్తుందని ప్రెడిక్షన్స్ చెబుతున్నాయి. అయితే వర్షం లేకపోవడంతో పదున్నరకు మ్యాచ్ ప్రారంభమైంది అవుతుందని అంపైర్లు తెలిపారు. ఒంటి గంటకు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. పది గంటలకు 58 శాతం, 11 గంటలకు 64 శాతం, 12 గంటలకు 49 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 59 శాతం, రెండు గంటలకు 49 శాతం, మూడు గంటలకు 49 శాతం, సాయంత్రం 4 గంటలకు 74 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని ప్రెడిక్షన్స్ ఉండగా.. తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉంది.

రెండో రోజు, మూడో రోజూ సాగేనా:

            రెండో రోజు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండనుంది. మూడో రోజు ఉదయాన్నే కొద్ది పాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని ప్రెడిక్షన్స్‌ చెబుతున్నాయి. అప్పుడప్పుడు తేలికపాటి వర్షం కురుస్తుందని అది మ్యాచ్ నిర్వహణకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు ఐదు రోజుల్లో మాత్రం వర్షం కురవదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఐతే మూడు రోజుల పాటు జోరువానలో ముద్దైన మైదానం నాలుగో రోజు ఐదో రోజు ఆటకు సిద్ధం చేయడం కోసం గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో భారత్‌ చెన్నై టెస్టులో గెలిచి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ టెస్టులో లోకల్‌ బాయ్ అశ్విన్‌, శుభ్‌మన్ గిల్‌, రిషబ్ పంత్ శతకాలతో చెలరేగారు. రవీంద్ర జడేజా 84 పరుగులతో అలరించగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 280 పరుగుల తేడాతో నెగ్గింది. కాన్పూర్‌ టెస్టు మ్యాచే బంగ్లా సీనియర్ ఆల్‌ రౌండర్ షకీబుల్ హసన్‌కు చివరి టెస్టు అయ్యే అవకాశం ఉంది. స్వదేశంలో మ్యాచ్ ఆడే అవకాశం తమ బోర్డు ఇవ్వకుంటే ఇదే తన ఆఖరి టెస్టు మ్యాచ్ అని షకీబ్ ఇప్పటికే ప్రకటించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget