News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Indian Bowlers: పార్ట్ టైమర్స్- భారత జట్టు విస్మరిస్తున్న ప్రధాన సమస్య!

Indian Bowlers: పార్ట్ టైమ్ బౌలర్లు... వారు వేసే ఒకట్రెండు ఓవర్లలోనే మ్యాచ్ మలుపుతిప్పగలరు. భాగస్వామ్యాలు బలపడుతున్న వేళ వికెట్లు తీయగలరు. ఇప్పుడు టీమిండియా విస్మరిస్తున్న సమస్య కూడా ఇదే.

FOLLOW US: 
Share:

Indian Bowlers:  టీమిండియా మ్యాచ్ ఓడిపోయి, టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించి రెండు రోజులు పూర్తయిపోయాయి. కానీ ఇంకా అదే బాధ, కోపం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. అందరి ఆవేదన ఒక్కటే. ఓడినా తప్పులేదు. కానీ కనీస పోరాటం లేకుండా చేతులెత్తేయడమే బాధిస్తోంది. అందరూ చెప్పుకున్నట్టు ఓపెనింగ్ సమస్య, బౌలింగ్ లో సరైన ఆటగాడు లేకపోవడమే ప్రధాన కారణాలన్నది స్పష్టం.  నిజమే. ఈ రెండు విభాగాల్లోనూ ఈ టోర్నమెంట్ లో మన ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచిన మాట వాస్తవమే. అయితే ఈ రెండింటినే ప్రధాన కారణాలుగా చూపిస్తూ... ఏళ్ల తరబడి వెంటాడుతున్న అసలు సమస్యను పక్కన పెట్టేద్దామా...? అదేంటో వివరంగా చెప్పుకుందాం. 

పార్ట్ టైమ్ బౌలర్లు... వారు వేసే ఒకట్రెండు ఓవర్లలోనే మ్యాచ్ మలుపు తిప్పగలరు. భాగస్వామ్యాలు బలపడుతున్న వేళ వికెట్ తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టగలరు. ప్రధాన బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేస్తున్న సమయాన బంతి అందుకుని రన్స్ ను కట్టడి చేయగలరు.  అవసరమైతే పూర్తి ఓవర్ల కోటా పూర్తిచేయగలరు. ఎందుకంటే వారి బౌలింగ్ గురించి ప్రత్యర్థి జట్లకు అంతగా అవగాహన ఉండదు కాబట్టి. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ప్రతి జట్టు తమ టీంలో ఒకరిద్దరు పార్ట్ టైమర్లు ఉండేలా చూసుకుంటోంది. అయితే భారత్ జట్టులో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా అలాంటి వాళ్లు లేరు. టీ20 ప్రపంచకప్ లో ఘోర వైఫల్యం తర్వాత టీమిండియా దృష్టి సారించాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటి.

అప్పుడు యువీ, రైనా.. ఇప్పుడెవరు?

కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. అంటే ధోనీ కెప్టెన్సీ కాలంలోకి. ఫార్మాట్ వేరే అయి ఉండొచ్చు కానీ ఇది కచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశమే. అప్పట్లో వన్డేల్లో, టీ20ల్లో మనకు సెహ్వాగ్, యువరాజ్, రైనా లాంటి పార్ట్ టైం బౌలర్లు కానీ, ఆల్ రౌండర్లు కానీ ఉండేవారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యువీ, రైనా గురించి. యువీ అవసరమైతే పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేసేవాడు. రైనా అయితే ప్రత్యేకమే. ప్రత్యర్థి భాగస్వామ్యాలను విడదీసేందుకు ధోనీ రైనాను బాగా ఉపయోగించుకునేవాడు. ఆ రోజుల్లో ప్రధాన బౌలర్ల ప్రదర్శన కొంచెం అటూ ఇటూ అయితే ఈ పార్ట్ టైమర్లు రెడీగా ఉండేవారు. అంతేకాదు ఇలా ఇద్దరు, ముగ్గురు బౌలింగ్ ఆప్షన్ గా ఉండడం వల్ల తుది జట్టులో ఓ అదనపు బ్యాట్స్ మెన్ ను ఆడించే వీలుండేది. లోయరార్డర్ లో బ్యాటింగ్ లోతు పెరిగేది. ఇదంతా అప్పుడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి ఇప్పుడు రోహిత్ హయాం వరకు మన జట్టులో అలాంటి ఆల్ రౌండర్లు ఎంతమంది ఉన్నారు? గుర్తురావట్లేదు కదా. అసలుంటే కదా గుర్తొచ్చేది. అవును ఇది నిజం. ఇదే మన జట్టు విస్మరిస్తున్న ప్రధాన సమస్య. 

పార్ట్ టైమర్స్ జట్టుకు బలం

టీ20ల్లో ఇంతకుముందు ఓ థియరీ ఉండేది. ప్రతి జట్టు ఆరు బౌలింగ్ ఆప్షన్స్ తో బరిలోకి దిగితే మంచిదని. అయితే మారుతున్న ఆటను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు 7 బౌలింగ్ ఆప్షన్లు ఉంటే మంచిదని అన్ని దేశాలు అనుకుంటున్నాయి. భారత్ తప్ప మిగతా జట్లన్నీ దాదాపుగా ఇదే అనుసరిస్తున్నాయి. ఫలితాలు రాబడుతున్నాయి. మన పరిస్థితి ఏంటంటే.. హార్దిక్ పాండ్య మనకు ఆరో బౌలింగ్ ఆప్షన్. జట్టులో మరో అదనపు బ్యాట్స్ మెన్ ను ఆడించాలంటే హార్దిక్ నే ఐదో బౌలర్ గా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఆ ఐదుగురు బౌలర్లు మ్యాచ్ రోజున సరిగ్గా బౌలింగ్ చేయకపోయినా, పరుగులు సమర్పించుకున్నా వారితోనే బౌలింగ్ వేయించాలి. ఎందుకంటే మరో ఆప్షన్ లేదు కాబట్టి. మన జట్టు లైనప్ చూసుకుంటే... రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ ఇదీ టాప్ 5 బ్యాట్స్ మెన్. వీరిలో ఎవరూ కనీసం 2 ఓవర్లైనా బౌలింగ్ చేయలేరు. అంతకుముందు కోహ్లీ, రోహిత్ అప్పుడప్పుడు ఒక్కో ఓవర్ అయినా వేసేవారు. రోహిత్ కు అయితే ఐపీఎల్ లో హ్యాట్రిక్ కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా రోహిత్ అసలు బంతి అందుకోవట్లేదు. 

ఇంగ్లండ్ తో సెమీస్ లో మన జట్టు ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణం. పార్ట్ టైమ్ బౌలర్లు లేకపోవడం అన్నది ఎప్పటికైనా జట్టుకు లోటే. ఏ జట్టుకైనా పార్ట్ టైమర్స్ విలువ వెలకట్టలేనిది. వారిని ప్రత్యర్థి జట్లు తక్కువ అంచనా వేస్తారు. కాబట్టి వికెట్లు దక్కే అవకాశముంటుంది. కాబట్టి టాప్ 5 లో ఒకట్రెండు ఓవర్లు వేసే బ్యాటర్లు మన జట్టులో ఉండనంత కాలం.. ఆ బ్యాకప్ ఆప్షన్ ఉందన్న ధీమా రానంత కాలం జట్టు సమతూకంగా ఉండదు. 

Published at : 12 Nov 2022 01:51 PM (IST) Tags: Team India team india news Team India latest news Part time bowlers Team India part time bowlers

ఇవి కూడా చూడండి

Team India: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ , ఘన స్వాగతం పలికిన అభిమానులు

Team India: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ , ఘన స్వాగతం పలికిన అభిమానులు

Mushfiqur Rahim: అలా జరిగిపోయిందంతే , కావాలని చేతితో బంతిని ఆపలేదు

Mushfiqur Rahim: అలా జరిగిపోయిందంతే , కావాలని చేతితో బంతిని ఆపలేదు

Rishabh Pant: ఐపీఎల్‌ బరిలో రిషభ్‌ పంత్‌ , తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్‌

Rishabh Pant: ఐపీఎల్‌ బరిలో రిషభ్‌ పంత్‌ , తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్‌

Brian Lara : రాసిపెట్టుకోండి... గిల్‌ ఒక్కడికే సాధ్యం, లారా ప్రశంసల జల్లు

Brian Lara : రాసిపెట్టుకోండి... గిల్‌ ఒక్కడికే సాధ్యం, లారా ప్రశంసల  జల్లు

BAN vs NZ, 2nd Test: తొలి రోజే నేలకూలిన 15 వికెట్లు , ఆసక్తికరంగా బంగ్లా-కివీస్‌ రెండో టెస్ట్‌

BAN vs NZ, 2nd Test: తొలి రోజే నేలకూలిన 15 వికెట్లు , ఆసక్తికరంగా బంగ్లా-కివీస్‌ రెండో టెస్ట్‌

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?