ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడానికి ఆడినట్టు ఉంది- మొదటి బాల్ నుంచి టీమిండియా హ్యాండ్సాప్!
టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుంచి ఆఖరి విన్నింగ్ షాట్ వరకూ ప్రతీ పాయింట్ దగ్గర ఇంగ్లండ్ మ్యాచ్ గెలవాలనే కసితో ఆడింది. కానీ ఇండియా దానికి క్వైట్ ఆపోజిట్.
ఎన్నో కలలు..ఎన్నో ఆశలు..ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాలని. డూ ఆర్ డై లా ఆ మ్యాచ్ జరిగి ఇండియా విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని ప్రతీ భారతీయ క్రికెట్ అభిమానీ కోరుకున్నాడు. సౌతాఫ్రికా మ్యాచ్‌ను మినహాయిస్తే లీగ్ స్టేజ్ మొత్తం అద్భుతంగా ఆడింది మన టీమ్. మన కొహ్లీ, మన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. ఈసారి కప్పు మనదే అని సంబరపడ్డాం. కానీ సెమీస్‌లో ఇలా అనుకోని గండం మనల్ని ఇంటికి పంపించేసింది.
ఇంగ్లండ్ బలమైన టీమే కానీ ఈ వరల్డ్ కప్‌లో తమ స్థాయికి తగిన ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. అదేంటో ప్రపంచంలో ఫామ్‌లో లేని జట్టు కానీ, ఆటగాడు కానీ ఫామ్‌లోకి రావాలంటే ఇండియాతో ఆడితే చాలు అన్నట్టు ఉంది ఇప్పటి వరకు రికార్డు. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సాగించిన విధ్వంసం గురించి ఏమని చెప్పుకోవాలి. మరీ పదివికెట్ల తేడాతో గెలిచారు ఇంగ్లండ్ ప్లేయర్స్.
టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుంచి ఆఖరి విన్నింగ్ షాట్ వరకూ ప్రతీ పాయింట్ దగ్గర ఇంగ్లండ్ మ్యాచ్ గెలవాలనే కసితో ఆడింది. కానీ ఇండియా దానికి క్వైట్ ఆపోజిట్. ఎర్లీగా వికెట్లు పడిపోతున్నా కొహ్లీ, హార్దిక్ తప్ప మిగిలిన వారంతా ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్నట్లు ఆడారు. రోహిత్, రాహుల్, సూర్య త్వరగా అవుటైపోవటంతో ఓవర్లు పరిగెత్తాయే కానీ స్కోరు బోర్డు మాత్రం కదల్లేదు. కొహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టడం... హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించి 63 పరుగులు చేయటంతో టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.
వాస్తవానికి బ్యాటింగ్ పిచ్‌పైనా ఈ స్కోరు కొంచెం ఫైట్ చేయగలిగేదే. కానీ టీమిండియా బౌలింగ్ అసలు గెలవాలని వేసినట్లు లేదు. ఫీల్డింగ్ లోపాలు ఎప్పుడూ టీమిండియాను వెంటాడేవే కనీసం రెగ్యులర్ ఇంటర్ వెల్‌లో వికెట్లు తీసే బౌలర్లు కూడా ఈసారి అమాంతం చేతులెత్తేశారు. ఒక్క వికెట్ తీయటానికి... ఓపెనింగ్ పార్టనర్ షిప్‌ను బ్రేక్ చేయటానికి కూడా ఆపసోపాలు పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు మన బౌలింగ్ దళం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో.
పేసర్లు భువనేశ్వర్, అర్ష్‌దీప్, షమీ, ఆల్ రౌండర్ పాండ్యా, స్పిన్నర్లు అక్షర్, అశ్విన్ వికెట్లు తీయటం అటుంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయటానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చోకర్లు అని వాళ్లను వీళ్లను కాదు 2011 వరల్డ్ కప్ తర్వాత ఆడిన టోర్నమెంట్స్‌లో మన పరిస్థితి అలానే తయారైంది. చచ్చీ చెడీ నాకౌట్ స్టేజ్‌కు వెళ్లినా ఇలా గెలిచి తీరాల్సిన మ్యాచుల్లో చేతులెత్తేయటం పరిపాటిగా మారిపోయింది.
ఈ ఒక్క మ్యాచ్‌లో టోర్నీలో భారత్ ఆడిన ఆటంతా తీసిపారేయలేం కానీ ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోతే పడిన కష్టం అంతా వృథా అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మన బౌలర్లు బౌలింగ్ వేయాల్సింది. మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి మొదలైన పరుగుల వరద ముందు..168 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. బట్లర్, హేల్స్ వికెట్ తీయకుండానే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓడిపోవటానికే ఆడామా అన్నట్లు ఆడిన ఈ ఆట టోర్నమెంట్‌లో మొత్తం ప్రదర్శనకే మచ్చలా మిగిలింది. ఎనీవే ఎండ్ ఆఫ్ ది ఇట్స్ ఏ గేమ్. ఎయిదర్ విన్ ఆర్ లాస్ ఏదో టీమ్‌కు రావాల్సిందే. కానీ పోరాడి ఓడిపోయినా ఆ మజానే వేరు బాస్. సగటు క్రికెట్ అభిమాని ఆవేదన ఇదే. మనం లేని ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో విజేత ఎవరో తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.