Sarfaraz khan Father: సర్ఫరాజ్ ఖాన్ కోసం ఆ తండ్రి ఇంత చేశారా?
Sarfaraz khan Father Emotional: కొడుకు సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకు సెలక్ట్ అవడం, క్యాప్ అందుకుని మైదానంలోకి దిగడంతో తండ్రి నౌషద్ ఖాన్ కల నెరవేరింది.
Team India cricketer Sarfaraz Khan: కొడుకు క్రికెట్ ఆడుతుంటే... రేయ్ టైం వేస్ట్ అదంతా.. ర్యాంకులు కొట్టాలంటే పుస్తకాలు పట్టుకోవాలని నాన్నలు గట్టిగా చెప్పే రోజులవి..! కానీ, సర్ఫరాజ్ ఖాన్ కు మాత్రం వాళ్ల నాన్న పుస్తకాలతో పని జరగదు. బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ కు తీసుకెళ్లాడు. అలా మొదలైన ప్రయాణం టీం ఇండియా జెర్సీ వేసుకునే వరకు వెళ్లింది. అందుకే ఈ కన్నీళ్లు. కల నెరవేరిన తరువాత వచ్చే ఆనంద బాష్పాలు..! కుమారుడి కలను నెరవేర్చడంతో పాటు దశాబ్దాల తన బాధను సైతం ఆయన జయించారు. టీమిండియాలోకి సర్ఫరాజ్ ఎంట్రీతో.. మాజీ రంజీ క్రికెటర్, తండ్రి నౌషద్ లక్ష్యం నెరవేరినట్లయింది.
టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ముంబయి తరపున రంజీ క్రికెట్ ఆడాడు. సరైన సపోర్ట్ లేక టీం ఇండియా తరపున ఆడలేకపోయారు. తన ఆ కలను కొడుకుల ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనో రైల్వే ఉద్యోగి. ఆ చాలి చాలనీ జీతమంతా సర్ఫరాజ్ ఖాన్, ఇంకో ఇద్దరి కొడుకులను క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. ఆ ముగ్గురు తన తండ్రి కలను.. తమ లక్ష్యంగా మలుచుకున్నారు.
సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. 2019-20 రంజీ సీజన్‌లో సర్ఫరాజ్ ముంబైకి స్టార్ పెర్ఫార్మర్. అప్పటి నుండి, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 82.46 సగటుతో ఉన్నాడు. వరుసగా రెండు సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ లో బెంగళూరు, పంజాబ్ వంటి టీమ్స్ కు ఆడాడు. ఇలా ఫ్రూవ్ చేసుకుంటున్నా..టీం ఇండియాలో చోటు కోసం 2ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆ అవకాశం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో వచ్చింది. అరగేంట్ర మ్యాచ్ లో నే 62 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. ఈ మట్టిలో మాణిక్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇలాంటి స్టార్ ని తయారు చేసిన తండ్రి నౌషద్ కు ఆనంద్ర మహీంద్రా థార్ కారు గిఫ్ట్ గా ఇస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పుడు దేశం మొత్తం సర్ఫరాజ్ ఖాన్ గురించి పొగుడుతుంటే .. ఈ క్షణాన నౌషద్ కంటే గర్వపడే వ్యక్తి ఎవరు ఉండరు.
రాజ్‌కోట్‌లోని గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశారు. 26 ఏళ్ల సర్ఫరాజ్ దేశవాళీలో రికార్డుల మోత మోగించి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.85 యావరేజ్‌తో 3912 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా అండర్ 19 టీం ఇండియా జట్టులో ఉన్నాడు. త్వరలోనే ఇండియా జట్టుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.