News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mohammed Shami: ఆఖరి ఓవర్ షమీకే ఎందుకు? క్లారిటీ ఇచ్చిన రోహిత్!

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మహ్మద్ షమీకి కేవలం ఆఖరి ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చారో రోహిత్ వివరించాడు.

FOLLOW US: 
Share:

2022 టీ20 ప్రపంచ కప్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియా చేరిన కొద్ది రోజులకే మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ వెటరన్ పేసర్ సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఆఖరి ఓవర్. కానీ ఆ ఆరు బంతుల్లో అతను చేసిన బౌలింగ్ ప్రదర్శన అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా షమీ బౌలింగ్‌కు ఇంప్రెస్ అయ్యాడు.

ప్రాక్టీస్ గేమ్‌లో రోహిత్ ఆశ్చర్యకరంగా షమీని మ్యాచ్‌లో ఎక్కువ భాగం బౌలింగ్‌కు దూరంగా ఉంచాడు. అయితే 20వ ఓవర్‌లో షమీకి బంతిని అందించి హిట్‌మ్యాన్ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఈ వెటరన్ పేసర్ ఒక్క బంతి కూడా వేయలేదు. కానీ బలమైన ఆస్ట్రేలియన్‌లపై చివరి ఓవర్‌లో 10 పరుగులు డిఫెండ్ చేసే టాస్క్‌ను అప్పగించారు.

మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ మూడో బంతికి ప్యాట్ కమిన్స్‌ను అవుట్ చేశాడు. బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో కమిన్స్ ఆశ్చర్యపోతూనే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాతి బంతికి ఆస్టన్ అగర్ రనౌట్ అయ్యాడు. షమీ తర్వాతి రెండు బంతుల్లో జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 180 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ షమీకి ఒక ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చాడో, అది కూడా ఆఖరి ఓవరే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాడు. "అతను (షమీ) చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్నాడు, కాబట్టి మేం అతనికి ఒక ఓవర్ ఇవ్వాలనుకున్నాము. అతనికి ఒక ఛాలెంజ్ ఇవ్వాలని చివరి ఓవర్ ఇచ్చాం. షమి ఎంత గొప్ప బౌలింగ్ ప్రదర్శనను కనపరిచాడో అందరూ చూశారు" అని రోహిత్ చెప్పాడు.

బుమ్రా లేకపోవడంతో భారత్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహించే పెద్ద బాధ్యత షమీపై ఉంది. వార్మప్ గేమ్‌లో అతను ఆస్ట్రేలియాపై బౌలింగ్ చేసిన విధానాన్ని పరిశీలిస్తే అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది.

సోమవారం ఆస్ట్రేలియాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 187 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మొదట్లో బాగానే ఆడిన ఆస్ట్రేలియా చివర్లో తడబడి 180 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (76) అర్ధ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కానీ డెత్‌ ఓవర్లలో భారత బౌలర్లు హర్షల్ పటేల్, షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించారు.

చివరి ఓవర్లో 11 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఆస్ట్రేలియా బ్యాటర్లను షమీ కట్టడి చేశాడు. అయితే ఈ ఓవర్లో ప్యాట్ కమిన్స్ (7) కొట్టిన భారీ షాట్ సిక్సర్ వెళ్తుండగా కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో కమిన్స్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక రనౌట్ కాగా, ఇంగ్లిస్ (1)ను షమీ బౌల్డ్ చేశాడు. అంతకుముందు 19వ ఓవర్లో ఫించ్‌ను హర్షల్ పటేల్ క్లీన్‌ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మారింది. షమీ 3 వికెట్లతో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టగా, చాహల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించారు.

Published at : 17 Oct 2022 04:53 PM (IST) Tags: Rohit Sharma Jasprit Bumrah T20 World Cup Mohammed Shami Ind vs Aus Rohit About Shami

ఇవి కూడా చూడండి

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Mukesh Kumar:  ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

టాప్ స్టోరీస్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Elections Exit Polls :  గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? -  బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?