అన్వేషించండి

T20 world cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఘన విజయం

Australia vs zimbabwe | టీ 20 ప్రపంచ కప్ 2026లో జింబాబ్వే జట్టు సంచలనం చేసింది. ఆస్ట్రేలియా జట్టుపై 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మోస్తరు టార్గెట్ ఛేదించలేక ఆలౌట్ అయింది.

టీ20 వరల్డ్ కప్ 2026లో సంచలనం నమోదైంది. పటిష్ట ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వే విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచులో 23 పరుగుల తేడాతో ఆసీస్‌ను జింబాబ్వే జట్టు కంగుతినిపించింది. టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే ఓడించడం ఇది రెండోసారి. గతంలో తొలి టీ 20 వరల్డ్ కప్ 2007లోనూ ఆసీస్ జట్టును జింబాబ్వే ఓడించింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు మరో దారుణ ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. 

కొలంబో లోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన లీగ్ స్టేజీ మ్యాచులో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఏ దశలోనూ రాణించలేకపోయింది. 13 పరుగులకు ఓపెనర్ జోష్ ఇంగ్లిష్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వరుస విరామాల్లో బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. మ్యాట్ రెన్షా (65) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ జట్టు 19.3 ఓవర్లకు 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

రెన్షా రాణించకపోతే ఆసీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ముజర్ బని 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు బ్రాడ్ ఇవాన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. మసకద్జ, ర్యాన్ బురి తలో వికెట్ తీశారు. జింబాబ్వే బౌలర్లు ముజర్ బని, ఇవాన్స్ రాణించడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు.

టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అది ఎంత పెద్ద తప్పో ఆసీస్ జట్టుకు తరువాత అర్థమైంది. జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు) హఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ మరుమని (21 బంతుల్లో 35, 7 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో బాగా ఆడిన ఈ జోడీ 7.3 ఓవర్లలో 61 పరుగులు చేశాక మరుమని ఔటయ్యాడు. ఆతరువాత ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35 పరుగులు, 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు బెన్నెట్. రెండో వికెట్ కు 70 పరుగులు భాగస్వామ్యం చేశాక ర్యాన్ బర్ల్ ను కామెరూన్ గ్రీన్ ఔట్ చేశాడు. జింబాబ్వే బ్యాటర్లను ఔట్ చేయడానికి ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తరువాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్ )తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు బెన్నెట్. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 

ఆసీస్ జట్టుకు ఇది పెద్ద టార్గెట్ కాదు అని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ జింబాబ్వే బౌలర్లు సత్తా చాటారు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తరువాత కామెరూన్ గ్రీన్ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ సైతం డకౌట్ అయ్యాడు. టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన ఆసీస్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ (17)ను ఇవాన్స్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకున్నట్లు కనిపించలేదు. అయితే గ్లెన్ మాక్స్ వెల్ (31 బంతుల్లో 32), మ్యాట్ రెన్షా (65 పరుగులు, 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) 5వ వికెట్ కు 77 పరుగులు జోడించారు. స్టోయినిస్ (6), బెన్ డ్వార్ష్ (6) సైతం త్వరగా ఔటయ్యాడు. 

టీ20 వరల్డ్ కప్ 2026లో సంచలనం నమోదైంది. పటిష్ట ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వే విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచులో 23 పరుగుల తేడాతో ఆసీస్‌ను జింబాబ్వే జట్టు కంగుతినిపించింది. టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే ఓడించడం ఇది రెండోసారి. గతంలో తొలి టీ 20 వరల్డ్ కప్ 2007లోనూ ఆసీస్ జట్టును జింబాబ్వే ఓడించింది. కునెమన్ వికెట్ తీయడంతో ఆసీస్ 146 పరుగులకు ఆలౌట్ కావడం, మరోవైపు జింబాబ్వే శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget