అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
SA vs Afg Semi Final : చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కి
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్ 1లో అఫ్గానిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
South Africa vs Afghanistan Highlights: దక్షిణాఫ్రికా(South Africa) చరిత్ర సృష్టించింది. దురదృష్ట జట్టు అనే దశాబ్దాల ముద్రను బద్దలు కొడుతూ ప్రొటీస్... ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1992లో క్రికెట్‌లో తిరిగి ప్రవేశం చేసినప్పటి నుంచి ఏడుసార్లు సెమీఫైనల్స్‌కు చేరి.. ఏడుసార్లు పరాజయం పాలైన సఫారీలు...ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోలేదు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై తొలుత అఫ్గాన్(Afghanistan)ను కేవలం 56 పరుగులకే పరిమితం చేసిన సౌతాఫ్రికా... ఆ తర్వాత సునాసయంగా లక్ష్యాన్ని ఛేదించింది. పిచ్‌లో అనూహ్య బౌన్స్ ఉండడంతో ప్రొటీస్ ఛేదన కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. అయితే సఫారీ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే పట్టుదల ప్రదర్శించారు. అఫ్గాన్ బౌలర్లు పట్టుదల ప్రదర్శించినా.. అది సరిపోలేదు. హెండ్రింక్స్-కెప్టెన్ మార్క్రమ్ దక్షిణాఫ్రికాను ఫైనల్‌కు చేర్చారు.
కుప్పకూలిన అఫ్గాన్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో కాసేపట్లోనే అర్థమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు.. అఫ్గాన్ బ్యాటర్లను అసలు క్రీజులో నిలవనీయలేదు. పిచ్ అనూహ్యంగా స్పందిస్తుండడంతో బ్యాటర్లకు అసలు ఏమీ అర్థం కాలేదు. బంతి అసలు బౌన్స్ అవుతుందా... స్వింగ్ అవుతుందా... లో గా వస్తుందా అనేవి ఏవీ బ్యాటర్లకు అర్థం కాలేదు. తొలి ఓవర్ చివరి బంతికి ప్రారంభమైన అఫ్గాన్ బ్యాటర్ల పతనం 11.5 ఓవర్లలోనే 56 పరుగుల వద్దే ముగిసింది. మూడు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయని గుర్బాజ్‌ను జాన్సన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగు పరుగుల వద్ద అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం నిరంతరాయంగా కొనసాగింది. జాన్సన్ అఫ్గాన్‌ను మరో దెబ్బ కొట్టాడు. 8 బంతుల్లో 9 పరుగులు చేసిన గుల్బదీన్ నైబ్‌ను జాన్సన్ బౌల్డ్ చేశాడు. దీంతో 16 పరుగుల వద్ద అఫ్గాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రబాడ అఫ్గాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కాబూలీ బ్యాటింగ్ ఆర్డర్‌ను చెల్లాచెదురు చేశాడు. రెండు పరుగులే చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను రబాడ బౌల్డ్ చేయడంతో అఫ్గాన్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అదే ఓవర్లో మహ్మద్ నబీని కూడా రబాడ బౌల్డ్ చేశాడు. దీంతో 20 పరుగుల వద్దే అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ
తర్వాత కూడా ప్రొటీస్ బౌలర్లు పట్టు వదలలేదు. నోర్జే, షంసీ కూడా వికెట్లు తీయడంతో అఫ్గాన్ బ్యాటర్లు అసలు క్రీజులో నిలవలేకపోయారు. అజ్మతుల్లా ఒమ్రాజాయ్ చేసిన పది పరుగులే అఫ్గాన్ తరపున అత్యధిక పరుగులు కావడం గమనార్హం. తొమ్మిది మంది అప్గాన్ బ్యాటర్లు అసలు సింగిల్ డిజిట్ చేయలేకపోయారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అవ్వగా... నలుగురు బ్యాటర్లు రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరడంతో అప్గాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 3, షంసీ 3, రబాడ 2, నోర్జే 2 వికెట్లు తీశారు. షంసీ కేవలం 11 బంతులు వేసి ఆరే పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
సునాయసంగానే..
57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో పరుగులు చేసేందుకు చాలా కష్టపడింది. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న డికాక్ 5 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత హెండ్రిక్స్-కెప్టెన్ మార్క్రమ్ సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చారు. క్రీజులో నిల్చుకునే వరకూ ఆచితూచి ఆడిన ఈ జట్టు ఒక్కసారి క్రీజులు కుదురుకున్నాక స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్నా లక్ష్యం మరీ చిన్నదిగా ఉండడంతో సౌతాఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా పోయింది. హెండ్రిక్స్ 29, మార్క్రమ్ 23 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను ఫైనల్‌కు చేర్చారు. 57 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించి... ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement