అన్వేషించండి

T20 World Cup 2024, SL vs SA: శ్రీలంక 77 ఆలౌట్‌ , కష్టంగా ఛేదించిన సౌతాఫ్రికా

SL vs SA, T20 World Cup Highlights: టీ20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్‌ శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా టీ 20 ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసింది.

South Africa beat Sri Lanka by six wickets:  టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup)లో బౌలర్ల హవా కొనసాగుతోంది. శ్రీలంక(Sri Lanka)తో జరిగిన మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా( South Africa) బౌలర్లు చెలరేగిపోయారు. పిచ్‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన వేళ.. బౌలర్లు ప్రభావం చూపారు. సఫారీ బౌలర్‌ అన్రిచ్‌ నార్జే కేవలం ఏడు పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు నేలకూల్చడంతో... లంక కేవలం 77 పరుగులకే ఆలౌట్‌ అయింది. టీ 20 మ్యాచుల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.  ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 78 పరుగులు చేసేందుకు సఫారీ జట్టు 16 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసింది. డికాక్‌ 20 పరుగులు, క్లాసెన్‌ 19 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా టీ 20 ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసి శుభారంభం చేసింది.


నిప్పులు చెరిగిన నార్జే 
  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో కాసేపటికే లంకకు అర్థమైంది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నార్జే చెలరేగిపోయాడు. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ బౌలర్లకు అనుకూలించడం... అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా ఉండడంతో బ్యాటింగ్‌ చేయడం లంకేయుల వల్ల కాలేదు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో పాథుమ్‌ నిసంకను అవుట్‌ చేయడం ద్వారా బార్ట్‌మన్‌ లంక పతనాన్ని ప్రారంభించాడు. 13 పరుగుల వద్ద లంక తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నార్జే బంతితో నిప్పులు చెరిగాడు. తొలుత కుశాల్‌ మెండిస్‌ను అవుట్‌ చేసిన నార్జే.. ఆ తర్వాత కమిందు మెండీస్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లంక 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్ల కష్టాలు మరింత పెరిగాయి. కేశవ్ మహరాజ్‌ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. 8.2 బంతికి తొలుత వసీందు హసరంగను అవుట్‌ చేసిన కేశవ్‌ మహరాజ్‌... ఆ తర్వాతి బంతికే సధీర సమరవిక్రమను క్లీన్ బౌల్డ్‌ చేశాడు. దీంతో 31 పరుగులకు ఒకే వికెట్‌ కోల్పోయి పర్వాలేదనే స్థితిలో ఉన్న లంక... 40 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనంతరం చరిత్‌ అసలంక, ఏంజెలో మ్యాథ్యూస్‌ను.. నార్జే అవుట్‌ చేశాడు. ఏంజెలో మాథ్యూస్‌ 16 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం కగిసో రబాడ కూడా రెండు వికెట్లు తీయడంతో లంక 19.4 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లలో నార్జే నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం  ఏడు పరుగులు మాత్రమే  ఇచ్చి నాలుగు వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ రెండు వికెట్లు తీశారు.

సఫారీ కూడా కష్టంగానే
  78 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు సునాయసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. పిచ్‌ పేస్‌కు, స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా ప్రతీ పరుగుకు శ్రమించాల్సి వచ్చింది. రెండో  ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హెండ్రిక్స్‌ను తుషారా అవుట్‌ చేశాడు. కాసేపటికే మార్‌క్రమ్‌ కూడా అవుటయ్యాడు. దీంతో 4 ఓవర్లలో 23 పరుగులకే సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడకున్నా దక్షిణాఫ్రికాకు పరుగులు అంత తేలిగ్గా రాలేదు. 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్‌ క్లాసెన్ 19, స్టబ్స్‌ 13, డేవిడ్‌ మిల్లర్‌ ఆరు పరుగులు చేయడంతో 16.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించగలిగింది. నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించిన నార్జేకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
World Heart Day 2024 : ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే
ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే
Devara Day 2 Box Office Collection: రెండు రోజుల్లో 200 కోట్లు దాటేసిన 'దేవర' - మిక్స్డ్ టాక్‌తో ఎన్టీఆర్ రికార్డుల మోత
రెండు రోజుల్లో 200 కోట్లు దాటేసిన 'దేవర' - మిక్స్డ్ టాక్‌తో ఎన్టీఆర్ రికార్డుల మోత
Janhvi Kapoor : జాన్వీ కపూర్ IIFA లుక్స్ చూశారా? గోల్డెన్ బాడీకాన్ డ్రెస్​లో సూపర్​ హాట్​గా ఉన్న దేవర బ్యూటీ
జాన్వీ కపూర్ IIFA లుక్స్ చూశారా? గోల్డెన్ బాడీకాన్ డ్రెస్​లో సూపర్​ హాట్​గా ఉన్న దేవర బ్యూటీ
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Embed widget