News
News
X

ధోని ప్రిడిక్షన్ బిస్కెట్ అయింది- 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ కాలేదుగా..!

ఇండియా వెర్సస్ పాక్ ఫైనల్ అని చాలా మంది అంచనా వేసుకున్నారు. ఫైనల్‌లో ఇండియా గెలవడం ఖాయమని బాణసంచ కూడా కొని తెచ్చిపెట్టుకున్నారు.

FOLLOW US: 

ఈ మధ్య ధోనీ ఎంతో కాన్ఫిడెంట్‌గా 2011 సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పారు. చెప్పినట్లుగా టోర్నమెంట్ మెుదటి నుంచి టీం ఇండియాకు అంత మంచే జరిగింది. ఇంగ్లండ్ ముందు మ్యాచ్ వరకు.. ఆల్ మోస్ట్ 2011 వన్డే వరల్డ్ కప్‌లో జరిగినట్లుగా జరిగాయి. ఇంగ్లండ్ లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. క్వాలిఫై కాలేదు. ఇంటికి వెళ్తుందనుకున్న పాకిస్థాన్.. క్వాలిఫై అయింది. ఇదంతా ధోని ప్రిడిక్షన్ లాగా జరగడంతో.. పాకిస్థాన్ న్యూజిలాండ్ పై గెలిచి.. ఫైనల్ లోకి వెళ్లాగనే.. ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. 

ఇండియా వెర్సస్ పాక్ ఫైనల్ అని చాలా మంది అంచనా వేసుకున్నారు. ఫైనల్‌లో ఇండియా గెలవడం ఖాయమని బాణసంచ కూడా కొని తెచ్చిపెట్టుకున్నారు. ధోని బిస్కెట్ ప్రెడిక్షన్ నిజం అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు తెగ హడావుడి చేశాయి. ఐతే...ఎవరు ఊహించని విధంగా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీం ఇండియా ఘోరంగా ఓడిపోయింది. మనోళ్లు పరుగులు చేయడానికి తడబడితే.. ఇంగ్లండ్ టీమ్ ఓపెనర్సే మెుత్తం స్కోర్ కొట్టేశారు. దీంతో.. సెమీఫైనల్స్‌లోనే ఇంటి బాట పట్టిన టీం ఇండియా 2011 సీన్ రి క్రియేట్ చేయలేకపోయింది. ఇంకేముంది.. ధోని చెప్పిన ప్రెడిక్షన్ నిజంగా బిస్కేట్ ఐందిగా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుంచి ఆఖరి విన్నింగ్ షాట్ వరకూ ప్రతీ పాయింట్ దగ్గర ఇంగ్లండ్ మ్యాచ్ గెలవాలనే కసితో ఆడింది. కానీ ఇండియా దానికి క్వైట్ ఆపోజిట్. ఎర్లీగా వికెట్లు పడిపోతున్నా కొహ్లీ, హార్దిక్ తప్ప మిగిలిన వారంతా ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్నట్లు ఆడారు. రోహిత్, రాహుల్, సూర్య త్వరగా అవుటైపోవటంతో ఓవర్లు పరిగెత్తాయే కానీ స్కోరు బోర్డు మాత్రం కదల్లేదు. కొహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టడం... హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించి 63 పరుగులు చేయటంతో టీమిండియా 168 పరుగులు చేయగలిగింది. 

వాస్తవానికి బ్యాటింగ్ పిచ్‌పైనా ఈ స్కోరు కొంచెం ఫైట్ చేయగలిగేదే. కానీ టీమిండియా బౌలింగ్ అసలు గెలవాలని వేసినట్లు లేదు. ఫీల్డింగ్ లోపాలు ఎప్పుడూ టీమిండియాను వెంటాడేవే కనీసం రెగ్యులర్ ఇంటర్ వెల్‌లో వికెట్లు తీసే బౌలర్లు కూడా ఈసారి అమాంతం చేతులెత్తేశారు. ఒక్క వికెట్ తీయటానికి... ఓపెనింగ్ పార్టనర్ షిప్‌ను బ్రేక్ చేయటానికి కూడా ఆపసోపాలు పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు మన బౌలింగ్ దళం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో. 

News Reels

పేసర్లు భువనేశ్వర్, అర్ష్‌దీప్, షమీ, ఆల్ రౌండర్ పాండ్యా, స్పిన్నర్లు అక్షర్, అశ్విన్ వికెట్లు తీయటం అటుంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయటానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చోకర్లు అని వాళ్లను వీళ్లను కాదు 2011 వరల్డ్ కప్ తర్వాత ఆడిన టోర్నమెంట్స్‌లో మన పరిస్థితి అలానే తయారైంది. చచ్చీ చెడీ నాకౌట్ స్టేజ్‌కు వెళ్లినా ఇలా గెలిచి తీరాల్సిన మ్యాచుల్లో చేతులెత్తేయటం పరిపాటిగా మారిపోయింది. 

ఈ ఒక్క మ్యాచ్‌లో టోర్నీలో భారత్ ఆడిన ఆటంతా తీసిపారేయలేం కానీ ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోతే పడిన కష్టం అంతా వృథా అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మన బౌలర్లు బౌలింగ్ వేయాల్సింది. మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి మొదలైన పరుగుల వరద ముందు..168 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. బట్లర్, హేల్స్ వికెట్ తీయకుండానే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓడిపోవటానికే ఆడామా అన్నట్లు ఆడిన ఈ ఆట టోర్నమెంట్‌లో మొత్తం ప్రదర్శనకే మచ్చలా మిగిలింది. ఎనీవే ఎండ్ ఆఫ్ ది ఇట్స్ ఏ గేమ్. ఎయిదర్ విన్ ఆర్ లాస్ ఏదో టీమ్‌కు రావాల్సిందే. కానీ పోరాడి ఓడిపోయినా ఆ మజానే వేరు బాస్. సగటు క్రికెట్ అభిమాని ఆవేదన ఇదే. మనం లేని ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో విజేత ఎవరో తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.

Published at : 10 Nov 2022 06:50 PM (IST) Tags: #T20 World Cup 2022 England Captain Buttler ENG VS IND semifinal ENG VS IND semifinal match MS Dhoni's Prediction

సంబంధిత కథనాలు

Rohit Sharma - Rahul Dravid: రోహిత్, ద్రవిడ్ లకు బీసీసీఐ నుంచి పిలుపు- అందుకోసమేనా!

Rohit Sharma - Rahul Dravid: రోహిత్, ద్రవిడ్ లకు బీసీసీఐ నుంచి పిలుపు- అందుకోసమేనా!

David Warner: తట్టుకోలేవ్ తమ్ముడూ - ఐపీఎల్‌పై కామెరాన్ గ్రీన్‌కి డేవిడ్ వార్నర్ సలహా!

David Warner: తట్టుకోలేవ్ తమ్ముడూ - ఐపీఎల్‌పై కామెరాన్ గ్రీన్‌కి డేవిడ్ వార్నర్ సలహా!

Ruturaj Gaikwad Record: ఒకే ఓవర్లో 7 సిక్సులు- రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad Record: ఒకే ఓవర్లో 7 సిక్సులు- రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

MS Dhoni Dance: హార్దిక్ పాండ్యతో కలిసి దుబాయ్ లో ధోనీ డ్యాన్స్- వైరలవుతున్న వీడియో

MS Dhoni Dance: హార్దిక్ పాండ్యతో కలిసి దుబాయ్ లో ధోనీ డ్యాన్స్- వైరలవుతున్న వీడియో

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల