IND vs NED Match Highlights: రన్‌రేట్ పెంచుకున్న హిట్‌మ్యాన్ సేన! నెదర్లాండ్స్‌పై 56 తేడాతో విన్
IND vs NED Match Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది! వరుసగా రెండో విజయం అందుకుంది. సిడ్నీ వేదికగా సాగిన పోరులో నెదర్లాండ్స్‌ను 56 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
IND vs NED Match Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది! వరుసగా రెండో విజయం అందుకుంది. సిడ్నీ వేదికగా సాగిన పోరులో నెదర్లాండ్స్‌ను 56 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 180 టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 123/9కే పరిమితం చేసింది. టిమ్ ప్రింగిల్ (20; 15 బంతుల్లో 1x4, 1x6) టాప్ స్కోరర్. రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (51*; 25 బంతుల్లో 7x4, 1x6) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 39 బంతుల్లో 4x4, 3x6), విరాట్ కోహ్లీ (62*; 44 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీలతో రాణించారు. 4 పాయింట్లతో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది.
రాణించిన బౌలర్లు
భారీ టార్గెట్ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు వణికించారు. భువనేశ్వర్ కుమార్ కళ్లుచెదిరే బౌలింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్ విక్రమ్‌జీత్ (1) వికెట్లు ఎగరగొట్టాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ రంగంలోకి దిగాడు. వరుసగా మాక్స్ ఓడౌడ్ (16), బాస్ డిలీడ్ (16)ను పెవిలియన్ పంపించాడు. డ్రింక్స్ విరామానికి నెదర్లాండ్స్ 47/3తో కష్టాల్లో పడింది. మిడిల్ ఓవర్లలో కొలిన్ అకెర్‌మన్ (17), టామ్ కూపర్ (9)ని అశ్విన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ (5)ను భువీ, కీలకంగా ఆడుతున్న టిమ్ ప్రింగిల్ (20)ను షమి పెవిలియన్ పంపించడంతో టీమ్‌ఇండియా గెలుపు ఖాయమైంది. ఆఖర్లో లాగన్ వాన్ బీక్ (3), ఫ్రెడ్ క్లాసెన్ (0) వికెట్లను అర్షదీప్ తీశాడు. షరిజ్ అహ్మద్ (16), మీకెరన్ (14) నాటౌట్‌గా నిలిచారు.
.@akshar2026 put on an impressive show with the ball & was our top performer from the second innings of the #INDvNED #T20WorldCup match. 👌 👌 #TeamIndia
— BCCI (@BCCI) October 27, 2022
A summary of his performance 🔽 pic.twitter.com/VSKzpEByPc
ముగ్గురూ ముగ్గురే!
పిచ్ మందకొడిగా కావడం, వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో టాస్ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్‌కు మంచి టార్గెట్ ఇవ్వాలని భావించింది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లు దూకుడగా ఆడారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) త్వరగానే ఔటయ్యాడు. మీకెరన్ వేసిన 2.4వ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అతడు రివ్యూ తీసుకుందామన్నా రోహిత్ శర్మ నిరాకరించాడు. వికెట్ పడ్డప్పటికీ హిట్‌మ్యాన్ నెదర్లాండ్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
సూర్య షైన్!
టీమ్‌ఇండియా స్కోరు 84 వద్ద రోహిత్‌ను క్లాసెన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ జోరందుకున్నారు. పోటీపడి మరీ బంతిని బాదేశారు. విరాట్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంటే సూర్య 25 బంతుల్లోనే సాధించేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో టీమ్‌ఇండియా స్కోరు 179/2కి చేరుకుంది. మిస్టర్ 360 షాట్లకు ఫ్యాన్స్ కుషీ అయ్యారు. నెదర్లాండ్స్‌లో మీకెరెన్, క్లాసెన్ చెరో వికెట్ తీశారు.
.@akshar2026 picks up his second wicket as Bas De Leede departs.
— BCCI (@BCCI) October 27, 2022
Netherlands 47/3 after 9.2 overs.
Live - https://t.co/GVdXQKGVh3 #INDvNED #T20WorldCup pic.twitter.com/4c8UKwGTzm