అన్వేషించండి

IND vs ENG Highlights: పోయే.. పోయే.. 2022 కూడా పోయే! ఫైనల్‌ చేరని టీమ్‌ఇండియా!

IND vs ENG Semi Final Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది! 15 ఏళ్ల ఎదురు చూపులు ఫలించలేదు. టార్గెట్‌ను ఇంగ్లాండ్‌ 16 ఓవర్లకే 10 వికెట్ల తేడాతో ఛేదించింది.

IND vs ENG Semi Final Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది! 15 ఏళ్ల ఎదురు చూపులు ఫలించలేదు. ఐసీసీ ట్రోఫీ కోసం 130 కోట్ల మంది భారతీయులు మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే! అడిలైడ్‌ వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్‌ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది.

మరోవైపు ఈ టార్గెట్‌ను ఇంగ్లాండ్‌ సునాయాసంగా ఛేదించింది. 16 ఓవర్లకే 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పాకిస్థాన్‌తో బిగ్‌ ఫైనల్ ఆడేందుకు మెల్‌బోర్న్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (80; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్‌ (86; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్‌ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్‌ పాండ్య (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు.

హేల్స్‌, బట్లర్‌ బాదుడు

ఛేదనకు దిగిన ఆంగ్లేయులను అడ్డుకోవడంలో టీమ్‌ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. పిచ్‌ కండిషన్‌ను అర్థం చేసుకోకుండా వేగంగా బంతులు విసిరారు. దాంతో అలెక్స్‌ హేల్స్‌, జోస్‌ బట్లర్‌ పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. స్వింగ్‌ లభించకపోవడంతో భువనేశ్వర్‌ను బట్లర్‌ టార్గెట్‌ చేసుకున్నాడు. అర్షదీప్‌ సైతం ప్రభావం చూపలేదు. మహ్మద్‌ షమి సైతం ఎక్కువ రన్స్‌ ఇచ్చాడు. దాంతో 6 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 63 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ సైతం ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో వారికి అడ్డేలేకుండా పోయింది. హేల్స్‌ 28, బట్లర్‌ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకోవడంతో 10.1 ఓవర్లకే ఇంగ్లాండ్‌ స్కోరు 100 దాటేసింది.  ఆ తర్వాత వారిద్దరూ మరింత జోరు పెంచడంతో 83 బంతుల్లోనే 150కి చేరుకుంది. 16 ఓవర్లకే విజయం అందుకుంది.

నిలబడ్డ పాండ్య, కోహ్లీ

అడిలైడ్‌లో రాత్రంతా వర్షం. కవర్ల కిందే పిచ్‌. ఔట్‌ ఫీల్డ్‌పై తేమ. ఆకాశంలో మబ్బులు! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. టాస్‌ గెలవడంతో జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ తీసుకొని భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరు 9 వద్దే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (5) క్రిస్‌ వోక్స్‌ ఔట్‌ చేశాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడబోయి జోస్‌ బట్లర్‌కు కేఎల్‌ క్యాచ్‌ ఇచ్చాడు.

ఆంగ్లేయులు కఠినంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోహ్లీ, రోహిత్ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌కు 47 రన్స్‌ భాగస్వామ్యం అందించడంతో 7.5 ఓవర్లకు స్కోరు 50కి చేరుకుంది. వేగం పెంచే క్రమంలో రోహిత్‌ 8.5వ బంతికి ఔటయ్యాడు. సూర్యకుమార్‌ (14) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. 39 బంతుల్లో 50 చేసిన కోహ్లీకి అండగా నిలిచాడు. నాలుగో వికెట్ కు 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెకలొల్పాడు. మొదట్లో ఒకట్రెండు బంతుల్ని నిలకడగా ఆడిన పాండ్య డెత్‌ ఓవర్లలో వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టు స్కోరును 168/6కి చేర్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget