IND Vs PAK: పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ అంచనా తుదిజట్టు ఇదే - ఎవరి రోల్ ఏది - గెలవడానికి ఎవరేం చేయాలి?
టీ20 ప్రపంచకప్‌లో భారత్ అంచనా తుదిజట్టు ఇదే!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆదివారం పాకిస్థాన్‌తో టీ20 ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. ఆదివారం నాడు వర్షం కురుస్తుందని భావిస్తున్నారు కాబట్టి దీని కారణంగా భారత్ తుదిజట్టు ప్రణాళికలు మారతాయా అనే ప్రశ్న తలెత్తింది. ఈ సంవత్సరం ప్రారంభంలో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 కోసం రిషబ్ పంత్‌తో సహా ఏడుగురు బ్యాటర్లను భారత్ బరిలోకి దించిందని గుర్తుంచుకోవాలి.
పాకిస్తాన్‌తో అత్యంత ముఖ్యమైన పోరుకు భారత్ అంచనా తుదిజట్టు ఇదే
కేఎల్ రాహుల్: ప్రాక్టీస్ గేమ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై మొదట 74 పరుగులు చేసి, వార్మప్‌లో ఆస్ట్రేలియాపై 57 పరుగులను వేగంగా స్కోర్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాయి.
రోహిత్ శర్మ: భారత కెప్టెన్ నిలకడగా పెద్ద స్కోర్లు నమోదు చేయలేదు. కానీ అతను టాప్ ఆర్డర్‌లో వేగవంతమైన ఆరంభాన్ని అందించగలడు. అలాగే అవతలి ఎండ్‌లో వికెట్లు త్వరగా పడిపోతే వెయిటింగ్ గేమ్ కూడా ఆడగలడు.
విరాట్ కోహ్లి: తన పేరు మీద 71 సెంచరీలు కలిగి ఉన్న బ్యాటర్, తన ఫాంను తిరిగి పొందాడు. విరాట్ కూడా వెయిటింగ్, అటాకింగ్ గేమ్‌లను ఆడగలడు.
సూర్యకుమార్ యాదవ్: నిస్సందేహంగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టీ20 బ్యాటర్‌ల్లో ఒకడు. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా భారత్ పెద్ద స్కోర్లు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నం.2 ర్యాంక్ బ్యాటర్‌గా కూడా సూర్య ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా: ఈ ఆల్ రౌండర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే అతను ప్రతి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేయగలడా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
దినేష్ కార్తీక్: 37 ఏళ్ల ఈ బ్యాటర్‌ను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ "అతిథి బ్యాటర్" అని పిలుస్తారు. దాని వెనుక ఒక కారణం ఉంది. ఇన్నింగ్స్‌లోని చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్ నంబర్ వన్ బాల్ నుంచి విరుచుకుపడగలడు.
అక్షర్ పటేల్: గాయపడిన రవీంద్ర జడేజాకు ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ సరైన ప్రత్యామ్నాయం. అక్షర్ కొత్త బంతితోనూ బౌలింగ్ చేయగలడు. బ్యాట్‌తో కూడా అతను కీలకమైన బౌండరీలు కొట్టగలడు.
భువనేశ్వర్ కుమార్: భువీ ఆస్ట్రేలియాలో బంతిని స్వింగ్ చేయగలడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయగలడు కాబట్టి మ్యాచ్‌కు అతను కీలకంగా మారనున్నాడు.
మహ్మద్ షమీ: గత సంవత్సరం T20 ప్రపంచ కప్ నుండి ఈ పేసర్ అంతర్జాతీయ టీ20 ఆడలేదు, కానీ ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌లో అతను బౌల్ చేసిన ఒక ఓవర్ తన సామర్థ్యానికి రుజువు. అతను ప్రారంభంలో, డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగలడు. పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంలో హర్షల్ పటేల్ కష్టపడుతుండడంతో భారత్ సమస్యలకు షమీ సమాధానం చెప్పవచ్చు.
అర్ష్‌దీప్ సింగ్: ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌కి కీలక సమయాల్లో యార్కర్‌లను సంధించడంలో నైపుణ్యం ఉంది.
యుజ్వేంద్ర చాహల్: లెగ్ స్పిన్నర్లు సాంప్రదాయకంగా ఆస్ట్రేలియన్ పరిస్థితులలో బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తారు. చాహల్ తనకు ఎంతో ఇష్టమైన ఫ్లయిటెడ్ డెలివరీలను సమర్థవంతంగా సంధించగలడు.