Surya Kumar Yadav: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్- సూర్యకుమార్ కు బంపర్ ప్రమోషన్!
Surya Kumar Yadav: టీమిండియా నయా సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ప్రమాషన్ పొందే అవకాశమున్నట్లు సమాచారం.
Surya Kumar Yadav: టీమిండియా నయా సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ప్రమాషన్ పొందే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య సూపర్ ఫాంలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 లో కొనసాగుతున్నాడు.
డిసెంబర్ 21న బీసీసీఐ బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో ఆటగాళ్ల ప్రమోషన్, డిమోషన్, కాంట్రాక్ట్ నుంచి తొలగించాల్సిన ఆటగాళ్ల గురించి చర్చించనున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, సూర్యకుమార్ కు బంపర్ ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్య. శుభ్ మన్ గిల్ లు కూడా ప్రమోషన్ పొందవచ్చు. అలాగే ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహాలను కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.
4 కేటగిరీలు
బీసీసీఐ సెంట్రల్ కాంటాక్ట్ లిస్టులో ఏ ప్లస్, ఏ, బీ, సీ అనే 4 కేటగిరీలు ఉంటాయి. ఏ ప్లస్ లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తారు. ఏ లిస్టులో వారికి రూ. 5 కోట్లు, బీ కేటగిరీకి రూ. 3 కోట్లు, సీ కేటగిరీకి కోటి రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఏ ఆటగాడు ఏ లిస్టులో ఉండాలో నిర్ణయించేందుకు బీసీసీఐకు అనేక కొలమానాలు ఉన్నాయి. గ్రెడేషన్ సిస్టమ్ ను నిర్ణయించడానికి బీసీసీఐ జాతీయ సెలెక్టర్లతో సంప్రదిస్తుంది. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్ ను పరిగణనలోకి తీసుకుంటుంది.
ఏ ప్లస్, ఏలో ఉండే ఆటగాళ్ళు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ గా ఆడాలి. లేదా ఒక వైట్ బాల్ ఫార్మాట్ తో పాటు టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడై ఉండాలి. గ్రూప్ బిలో ఉండాలంటే కనీసం ఏదైనా 2 ఫార్మాట్లు ఆడాలి. గ్రూప్ సి సింగిల్ ఫార్మాట్ ఆటగాళ్లు కోసం ఉంది. అలాగే కాంట్రాక్ట్ లిస్టులో చేరాలంటే నిర్దిష్ట సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాలి. అలాగే ప్రమోషన్ అనేది పనితీరుపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం సూర్య గ్రూప్ సి లో ఉన్నాడు. అయితే గతేడాది అతని ప్రదర్శన ఆధారంగా గ్రూప్- బికి ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే వన్డే జట్టులో పోటీదారుగా ఉన్నాడు. కాబట్టి అతనికి ప్రమోషనే దక్కే ఛాన్స్ ఉంది. అని బీసీసీఐ కు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పినట్లు సమాచారం. అలాగే హార్దిక్ పాండ్య, గిల్ కూడా గ్రూప్ సి నుంచి బికి ప్రమోషన్ ఆశించవచ్చు. హార్దిక్ పాండ్య అంతకుముందు బి కేటగిరీలో ఉన్నాడు. అయితే గతేడాది వెన్ను గాయంతో జట్టుకు దూరమైనందున సి కేటగిరీకి వెళ్లాడు. 2022లో 2 ఫార్మాట్లలో నిర్దిష్ట అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్ సెంట్రల్ లిస్టులోకి రావచ్చు.
Series sealed 🏆🇮🇳
— Surya Kumar Yadav (@surya_14kumar) November 22, 2022
This was a special one💙 pic.twitter.com/IBSiU0WOxS