By: ABP Desam | Updated at : 01 Jan 2023 06:59 PM (IST)
Edited By: nagavarapu
సూర్యకుమార్ యాదవ్ (source: instagram)
New Year 2023: టీమిండియా టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ 2023 నూతన సంవత్సరం తొలి రోజును వినాయకుడ్ని దర్శించుకున్నారు. 32 ఏళ్ల సూర్య కుమార్ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు.
ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ20 క్రికెటర్ ఆఫి ది ఇయర్ అవార్డుకు సూర్యకుమార్య నామినేట్ అయ్యాడు. 2022లో సూర్యకుమార్ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం అతను ఈ సంవత్సరం 1164 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. 68 సిక్సర్లు బాదాడు. టీ20ల్లో ఈ ఏడాది ఇవే అత్యధికం. రెండు రోజుల్లో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యకు డిప్యూటీగా సూర్యను సెలక్ట్ చేశారు.
వైస్ కెప్టెన్ సూర్య
జనవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. తను సాధించిన విజయాలకు ఫలితంగా పదోన్నతి పొందాడు. వైస్ కెప్టెన్ గా ఎంపికవడం గురించి సూర్యను ప్రశ్నించగా.. తనకు ఇది ఒక కలలాగా ఉందని చెప్పాడు. అసలు అలా జరుగుతుందనే ఆశ తనకు లేదన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా బుధవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో సూర్య 95 పరుగులు చేశాడు.
దాని తరువాత సూర్య మాట్లాడాడు. 'మా నాన్న సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివేట్ గా ఉంటారు. బీసీసీఐ శ్రీలంకతో మ్యాచ్ లకు స్క్వాడ్ ను ప్రకటించాక ఆ జాబితాను నాన్న నాకు పంపారు. టీ20ల్లో వైస్ కెప్టెన్ గా ఎంపికవడాన్ని నేను నమ్మలేకపోయాను. ఇది నిజమేనా అని మా నాన్నను అడిగాను. ఆ తర్వాత దాని గురించి మేం మాట్లాడుకున్నాం. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా, నా బ్యాటింగ్ ను ఆస్వాదించమని నాన్న చెప్పారు.' అని సూర్యకుమార్ అన్నాడు.
ఆ కష్ట ఫలాన్ని ఇప్పుడు పొందుతున్నాను
గతేడాది టీ20ల్లో సూర్య హవా కొనసాగింది. 'వైస్ కెప్టెన్సీ ఇవ్వడం గురించి నాకు ఎలాంటి అంచనాలు లేవు. అయితే గత సంవత్సరం నేను సాధించినదానికి దీన్ని బహుమతిగా భావిస్తున్నాను. ఇది ఎన్నో సంవత్సరాల నా కష్టానికి ఫలితం. ఆ కష్ట ఫలాలను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న విషయాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని సూర్య తెలిపాడు.
🏏 @surya_14kumar and @BhuviOfficial are our Top Performers in T20Is for 2022 👏💪#TeamIndia pic.twitter.com/pRmzxl8TDm
— BCCI (@BCCI) December 31, 2022
What an incredible shortlist for ICC Men's T20I Cricketer of the Year 2022 🤩
— ICC (@ICC) December 29, 2022
More on their achievements 👉 https://t.co/TOiHUHq59Y#ICCAwards pic.twitter.com/Hrs83CnWHL
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?
Virat Kohli: కళ్లకు గంతలు కట్టుకున్నా టార్గెట్ మిస్ అవ్వదు - విరాట్ వైరల్ వీడియో చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవ్వాల్సిందే!
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు - ఐసీసీ ఎవరిని సెలక్ట్ చేసింది?
WPL 2023: ప్లేఆఫ్స్‌కు మూడే జట్లు - మహిళల ఐపీఎల్లో వెరైటీ రూల్!
IND vs AUS Test: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాదే- ఎందుకంటే: గ్రెగ్ ఛాపెల్
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...