News
News
వీడియోలు ఆటలు
X

SuryaKumar Yadav: ఫాంలో లేకపోయినా సూర్యనే టాప్‌ - ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్!

సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

FOLLOW US: 
Share:

SuryaKumar Yadav: భారత క్రికెట్ జట్టు, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ చాలా కాలంగా బ్యాడ్ ఫామ్‌తో పోరాడుతున్నప్పటికీ, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియా అభిమానులకు రిలీఫ్ న్యూస్.

ఐసీసీ తాజా T20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలోనే ఉన్నాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల మహ్మద్ రిజ్వాన్ న్యూజిలాండ్‌పై 98 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఈ బ్యాట్స్‌మన్ 13 పాయింట్లు సాధించాడు.

అగ్రస్థానంలో సూర్యకుమార్ యాదవ్
తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 906 రేటింగ్ పాయింట్లతో ఉండగా, పాక్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 811 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య గ్యాప్ 100 రేటింగ్ పాయింట్లకు తగ్గింది. సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, మహ్మద్ రిజ్వాన్ నంబర్ టూలో ఉన్నారు.

ఇది కాకుండా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో స్థానంలో ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత బాబర్ ఆజం రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. ప్రస్తుతం బాబర్ ఆజం 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ టాప్
మరోవైపు ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల గురించి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆటగాడు రషీద్ ఖాన్ నంబర్ వన్. నిజానికి రషీద్ ఖాన్ చాలా కాలంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ ఆఫ్ఘన్ లెజండరీ ప్లేయర్ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంతకు ముందు రషీద్ కాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ అంత ఫాంలో లేడు. 0, 0, 0, 14, 0, 31, 4, 6, 34, 4.. గడిచిన పది వన్డే ఇన్నింగ్స్ లలో   నయా మిస్టర్ 360  చేసిన స్కోర్లవి. అంటే  పది ఇన్నింగ్స్ లలో కలిపి వంద పరుగులు  కూడా చేయలేదు.   టీ20లలో నమ్మదగ్గ బ్యాటర్ గా ఉన్న  సూర్య.. వన్డేలలో మాత్రం  అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు.  తాను  ఈ ఫార్మాట్ కు పనికిరానని తనకు తానే   పదేపదే నిరూపించుకుంటున్నాడా..? అనిపించేలా ఉంది వన్డేలలో  సూర్య ఆట. 

సూర్య  ప్రదర్శన అతడికి మాత్రమే కాదు.. భారత జట్టుకూ ఆందోళన కలిగించేదే. అసలే ఈ ఏడాది అక్టోబర్ లో  భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనుంది.  ఈ మేరకు భారత్ తో పాటు అన్ని జట్లూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే టీమిండియాకు గాయాల బెడద వేధిస్తున్నది.  బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్  తో పాటు దీపక్ చాహర్  లు ఈ మెగా టోర్నీ వరకైనా అందుబాటులో ఉంటారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. వన్డేలలో అయ్యర్ స్థానాన్ని  భర్తే చేస్తాడని  భావిస్తున్నా  సూర్య మాత్రం   అందుకు విరుద్ధంగా వరుస  వైఫల్యాలతో విసుగు తెప్పిస్తున్నాడు.

Published at : 28 Apr 2023 12:09 AM (IST) Tags: Suryakumar Yadav Babar Azam Mohammad Rizwan ICC T20 Rankings

సంబంధిత కథనాలు

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు

Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు

Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి

Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?

ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!