అన్వేషించండి

Smriti Mandhana : మహిళల టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌పై మంధాన కీలక వ్యాఖ్యలు

Smriti Mandhana: టీమిండియా వైస్‌ కెప్టెన్‌  స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తే బాగుంటుందని మంధాన అభిప్రాయపడింది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయి.. సిరీస్‌ను కోల్పోయిన అనంతరం టీమిండియా వైస్‌ కెప్టెన్‌  స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తే బాగుంటుందని మంధాన అభిప్రాయపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తే మంచిదని... కానీ దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఐసీసీనే అని తెలిపింది. పురుషుల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఉన్నట్లే... మహిళలు కూడా ఛాంపియన్‌ షిప్‌లో ఆడితే చాలా బాగుంటుందని మందాన్న అభిప్రాయపడింది. అయితే ఇంగ్లాండ్‌ వెటరన్‌ ప్లేయర్‌ టామీ బ్యూమాంట్‌ మాత్రం మహిళల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌  వద్దని ఖరాఖండీగా చెప్పేసింది. కేవలం భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రమం తప్పకుండా మహిళల టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో.. డబ్ల్యూటీసీ నిర్వహించడం అన్యాయమని వ్యాఖ్యానించింది. ఇప్పుడు మూడు నాలుగు దేశాలకు మాత్రమే మహిళల టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే సామర్థ్యం ఉందని ఆమె అభిప్రాయపడింది. 

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ WPLపైనా బీసీసీఐ దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయి(Mumbai) వేదికగా డిసెంబర్‌ 9న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈసారి బెంగళూరు, ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మహిళా ప్రీమియర్‌ లీగ్ సీజన్‌కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతీ మంధాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ పోటీలు జరిగే పద్ధతిలోనే తమ మ్యాచ్‌లనూ నిర్వహించాలని మంధాన కోరింది. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ అభిమానుల ఆదరణను చూరగొందని పేర్కొంది. విభిన్న నగరాల్లో మహిళా ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగాలనేది తన కోరికని స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన తన మనసులోని మాట బయటపెట్టారు. అలా జరిగితే ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ మరో అడుగు ముందుకేసినట్లు అవుతుందని తెలిపారు. నిర్వాహకులు ఆ దిశగా ఆలోచిస్తారని భావిస్తున్నాని మంధాన వెల్లడించారు.

ఇప్పటికే మహిళా క్రికెట్‌ పురోగతి సాధించిందని.. విభిన్న నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు వీలుంటుందని మంధాన అభిప్రాయపడ్డారు. WPL వేలంలో అత్యుత్తమ ప్లేయర్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తేల్చి చెప్పారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆసియా గేమ్స్‌లో మహిళలు జట్టు పతకాలు సాధించిందని గుర్తు చేసిన ఈ స్టార్‌ బ్యాటర్‌.... గత పదేళ్ల నుంచి పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్‌ వృద్ధి చెందిందని తెలిపారు. మహిళా క్రీడాకారులకు దన్నుగా నిలిస్తే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని మంధాన ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబయివేదికగా డిసెంబర్‌ 9న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియ జరగనుంది. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
DA Hike News: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Embed widget