అన్వేషించండి

Shoaib Basheer Out From Eng: టెస్టు సిరీస్ నుంచి బ‌షీర్ ఔట్.. నాలుగో టెస్టుకు కొత్త స్పిన్న‌ర్ ఎంపిక‌.. ఈనెల 23 నుంచి 4వ టెస్టు.. స‌మ‌రోత్సాహంలో ఇంగ్లాండ్

ఐదు టెస్టుల సిరీస్ లో ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టులో పోరాడి ఓడిన భార‌త్.. అద్బుత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చింది. ఈనెల 23 నుంచి నాలుగో టెస్టు మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతుంది. 

Liam Dawson Re Entry:  ఇండియాతో మాంచెస్ట‌ర్ తో ఈనెల 23 నుంచి ప్రారంభ‌మ‌య్యే నాలుగో టెస్టుకు సంబంధించి ఇంగ్లాండ్ కీల‌క మార్పు చేసింది. గాయ‌ప‌డిన స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ స్థానంలో వెట‌ర‌న్ లియామ్ డాస‌న్ ను జ‌ట్టులోకి తీసుకుంది. మూడో రోజు రిష‌భ్ పంత్ కొట్టిన బంతిని అందుకునే ప్ర‌య‌త్నంలో బ‌షీర్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అత‌ని ఎడ‌మ చేతి చిటికెన వేలు విర‌గ‌డంతో స‌ర్జీరీ చేయ‌నున్నారు. దీంతో మిగ‌తా రెండు టెస్టుల‌కు త‌న‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఆ స్థానంలో డాస‌న్ ని ఎంపిక చేశారు. నిజానికి బ‌షీర్ స్థానంలో రెహాన్ అహ్మ‌ద్, జాక్ లీచ్, టామ్ హార్ట్ లీ పోటీ ప‌డినా, కౌంటీల్లో చాలా అనుభ‌వం ఉన్న డాస‌న్ కే ఇంగ్లాండ్ ఓటేసింది. త‌ను చివ‌రిసారిగా 2017లో సౌతాఫ్రికాపై టెస్టు ఆడాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌ను మూడు టెస్టులు ఆడ‌గా, కేవ‌లం ఏడు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. అయితే దేశ‌వాళీల్లో అత‌ను నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌టంతో, తిరిగి రీ ఎంట్రీ ద‌క్కింది. 

హేండీ బ్యాట‌ర్..
నిజానికి లెఫార్మ్ స్పిన్న‌రైన డాస‌న్.. వికెట్ కు వికెట్ అక్యూరెట్ గా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. ఇక అత‌డికి బ్యాటింగ్ సామ‌ర్థ్యం కూడా ఉంది. 35 ఏళ్ల డాస‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 212 మ్యాచ్ లు ఆడ‌గా, 371 వికెట్లు తీశాడు. స‌గ‌టు 31.5 కావ‌డం విశేషం. ఇక బ్యాటింగ్ లో 35కి పైగా స‌గ‌టుతో 56 ఫిఫ్టీలు, 18 సెంచ‌రీలు కూడా చేశాడు. నాలుగో టెస్టులో డాసన్ ఆడిన‌ట్ల‌యితే ఇంగ్లాండ్ లోయ‌ర్ ఆర్డ‌ర్ మ‌రింత ప‌టిష్ట‌మవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు..

గాయంతోనే కీల‌క పాత్ర‌..
మ‌రోవైపు మూడో టెస్టు మూడో రోజు గాయ‌ప‌డిన‌ప్ప‌టికీ, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో బ‌షీర్ త‌న ఉనికిని చాటుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో రెండు ప‌రుగులు చేసిన బ‌షీర్.. బౌలింగ్ లో మాత్రం కీల‌క వికెట్ ను సాధించాడు. ప‌దో వికెట్ అయిన మ‌హ్మ‌ద్ సిరాజ్ ను ఔట్ చేయ‌డంలో ఇంగ్లాండ్ పేస‌ర్లు చేతులెత్తేస్తే, బ‌షీర్ మాత్రం అత‌డిని ఔట్ చేసి, జ‌ట్టుకు విజ‌యాన్ని ఖాయం చేశాడు. ఎడ‌మ చేతికి క‌ట్టుతోనే తను బ్యాటింగ్, బౌలింగ్ చేయ‌డం విశేషం. మ‌రోవైపు దేశ‌వాళీల్లో నిల‌క‌డ‌గా రాణించ‌డంతోనే డాస‌న్ ని జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు ఇంగ్లాండ్ సెలెక్ట‌ర్ ల్యూక్ రైట్ స్ప‌ష్టం చేశాడు. హాంప్ షైర్ త‌ర‌పున త‌ను అద్భుతంగా రాణిస్తున్న విష‌యాన్ని గుర్తు చేశాడు. ఇక గ‌త‌నెల‌లో వెస్టిండీస్ తో జ‌రిగిన టీ20 సిరీస్ లోనూ డాస‌న్ అడాడు. ఈ సిరీస్ లో ఐదు వికెట్లు తీసి ఉమ్మడి అత్యుత్త‌మ బౌల‌ర్ గా నిలిచాడు. ఇలాంటి ప్ర‌దర్శ‌నే నాలుగో టెస్టులో కొన‌సాగించాల‌ని త‌ను భావిస్తున్నాడు. 

నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్:  బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చ‌ర్, గ‌స్ అట్కిన్సన్, జాక‌బ్ బెతెల్, హేరీ బ్రూక్, బ్రైడెన్ కార్స్, జాక్ క్రాలీ, లియామ్ డాస‌న్‌, బెన్ డ‌కెట్, ఒల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్. 



టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget