అన్వేషించండి

Shamar Joseph: అరంగేట్రం చేసిన నెలలోనే ఐసీసీ అవార్డు, ఎవరికంటే?

ICC Player of the Month award: వెస్టిండీస్‌ నయా సంచలనం షెమర్‌ జోసెఫ్‌ కు గత నెల ప్రదర్శనలకు గాను జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు.

Shamar Joseph win ICC Player of the Month award: షమార్‌ జోసెఫ్‌(Shamar Joseph)... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్‌ సీమర్‌ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ వెస్టిండీస్‌ నయా సంచలనానికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గత నెలలో షెమర్‌ జోసెఫ్‌ ప్రదర్శనలకు గాను అతడు జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఐసీసీ అవార్డు
 ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌, ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ జోష్‌ హెజిల్‌వుడ్‌లను వెనక్కినెట్టి జోసెఫ్‌ జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టులో విండీస్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జోసెఫ్‌.. టెస్టులలో తొలి వికెట్‌గా స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీశాడు. ఇటీవలే లక్నో జట్టు రూ. 3.6 కోట్లతో షెమర్‌ను జట్టులోకి తీసుకుంది. ఎంట్రీ ఇచ్చి నెల రోజులు కాకముందే సంచలనాలతో దూసుకుపోతున్న షెమర్‌ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

నేపథ్యం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే...
గయానా దీవుల్లోని ఫోన్లు, ఇంటర్నెట్‌లు లేని ఓ పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టాడు షమార్‌. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్లాలంటే పడవలే దిక్కు. తొలుత కట్టెలు కొట్టే పని చేసే షమార్‌... తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వలస వెళ్లి ఓ నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా మారాడు. ఆ తర్వాత అతను సెక్యూరిటీ గార్డుగానూ పని చేశాడు. రెండేళ్ల ముందు వరకు అతను అదే పనిలోనే ఉన్నాడు. వెస్టిండీస్‌ జాతీయ జట్టుకు ఆడిన రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయం వల్ల అతను గయానా జట్టు కోచ్‌ దృష్టిలో పడ్డాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలక్షన్‌ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్‌-1 క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీశాడు. తర్వాత కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా ఛాన్స్‌ దక్కింది. అదే సమయంలో దిగ్గజ బౌలర్‌ ఆంబ్రోస్‌.. అతడి బౌలింగ్‌ చూసి మెచ్చుకున్నాడు. ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నానని  అన్నాడు. ఆంబ్రోస్‌ చెప్పిన గడువులోపే షమార్‌.. 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో, అలాగే గత ఏడాది కరీబియన్‌ లీగ్‌లో నిలకడగా రాణించడంతో ఇటీవలే వెస్టిండీస్‌ జాతీయ జట్టులోకి ఎంపికైన షమార్‌.. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన చేసి హీరోగా మారాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget