అన్వేషించండి

Virat Kohli: సచిన్‌ నా హీరో, అతనిలా నేను ఆడలేను: విరాట్‌ కోహ్లీ

Virat Kohli : జన్మదినం రోజున తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కింగ్‌ కోహ్లీ... క్రికెట్‌ దేవుడిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.

జన్మదినం రోజున తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కింగ్‌ కోహ్లీ... క్రికెట్‌ దేవుడిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. 49వ వన్డే సెంచరీ చేసిన అనంతరం సచిన్‌పై తనకున్న అభిమానం గురించి చాటిచెప్పాడు. సచిన్ టెండూల్కర్ తన హీరో అని... అతనిలా తాను ఎప్పుడూ రాణించలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సచిన్ ఎప్పటికీ తన ఆరాధ్యుడేనన్న కోహ్లీ.. సచినతో తనను పోల్చడాన్ని తప్పుపట్టాడు. క్రికెట్ లెజెండ్‌ సచిన్‌లా తాను ఎప్పటికీ రాణించలేనని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ... తన హీరో రికార్డును సమం చేయడం తనకు ప్రత్యేకమైన క్షణమని అన్నాడు. బ్యాటింగ్‌లో సచిన్‌ పరిపూర్ణుడని కోహ్లీ కొనియాడాడు. సచిన్‌ ఎప్పుడూ తన హీరోగానే ఉంటాడని  కోహ్లీ చెప్పాడు.
 
క్రికెట్‌లో ఇది తనకు ఎమోషనల్ జర్నీ అన్న కోహ్లీ... టెండూల్కర్ నుంచి ప్రత్యేక సందేశాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను ఆరాధించే ఆటగాడి రికార్డును సమం చేయడం... అతడి నుంచి సందేశం అందుకోవడం భావోద్వేగంగా ఉందని కోహ్లీ అన్నాడు. తాను సచిన్‌ బ్యాటింగ్ చూస్తూ పెరిగానన్న విరాట్‌.. తాను ఎప్పుడూ సచిన్‌లా రాణించలేదని అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా మూలాలు ఏంటో నాకు బాగా తెలుసన్న కోహ్లీ... ఇక్కడ నిలబడి సచిన్‌ ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు.
 
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ... సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ.... వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్‌తో సమానంగా నిలిచి తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటిచెప్పాడు. వైఫల్యాల మధ్యే మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్ కోహ్లీ... ఈ పుట్టిన రోజున తాను ఎంతో ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి తనకు తానే మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు.
 
దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించి విరాట్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును సమం చేశాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్‌...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఈ ప్రపంచకప్‌ కల నెరవేర్చుకునేందుకు రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో... నాకౌట్‌ పోరులో అద్భుత శతకంతో కోహ్లీ చెలరేగి కప్పుతో పాటు సచిన్‌ రికార్డును బద్దలు కొడితే భారత క్రికెట్‌ అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
 
వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో భారత్ మొదటి స్థానం పదిలం అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది. కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (77: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా 15 పరుగుల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా భరతం పట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్‌ 83 పరుగులకే కుప్పకూలింది.

టాప్ హెడ్ లైన్స్

India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget