అన్వేషించండి

Rohit Sharma : ధోనీ తర్వాత రోహిత్ శర్మే, రెండో భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌

Rohit Sharma: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

భారత(Team India) క్రికెట్‌జట్టు (Cricket Team) దక్షిణాఫ్రికా(South Africa) పర్యటనను సిరీస్‌ ఓటమి లేకుండా ముగించింది. కేవలం 107 ఓటర్లు సాగిన రెండోటెస్టులో గెలిచిన భారత్‌ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది. కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌.  తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌(Siraj)కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా... కేప్‌టౌన్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదుచేసింది. రెండో టెస్ట్‌ గెలుపుతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌రువాత... దక్షిణాఫ్రికాలో ప్రొటీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను డ్రా చేసుకున్న కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. ద‌క్షిణాఫ్రికాలో ఒక్క సారి కూడా భార‌త జ‌ట్టు టెస్టు సిరీస్‌ను గెల‌వ‌లేదు. ఇందులో ఏడు సార్లు ఓడిపోగా.. కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్రమే టెస్టు సిరీస్‌ను స‌మం చేసింది. ధోనీ కెప్టెన్సీలో 2010-11లో 1-1తో, రోహిత్ సార‌థ్యంలో 2023-2024 ప‌ర్యట‌న‌లో 1-1తో టెస్టు సిరీస్‌ల‌ను స‌మం చేసింది.

ఘన  విజయంతో పర్యటన ముగింపు
దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం పాలైన భారత్‌ జట్టు.. రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో భారత పేసర్లు.. సఫారీ బ్యాటర్లలకు చుక్కలు చూపించి...విజయానికి బాటలు వేశారు. 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
తొలి ఇన్నింగ్స్‌ సాగిందిలా...
కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. చెలరేగిన సిరాజ్ ధాటికి దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. సిరాజ్‌ ఆరు వికెట్లతో ప్రొటీస్‌ పనిపట్టాడు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా  బుమ్రా ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.  పడుతున్నా మార్‌క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో మార్‌క్రమ్‌ 106 పరుగులు చేశాడు. బుమ్రా  ఆరు వికెట్లు నేలకూల్చి దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించాడు. అనంతరం 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget