అన్వేషించండి

Roelof Van Der Merwe: దక్షిణాఫ్రికాలో పుట్టి-ఆ జట్టునే ఓడించి..

Roelof van der Merwe: నెదర్లాండ్స్‌ అద్భుత విజయం వెనక ఒక ఆటగాడి పాత్ర ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు .. బంతితోనూ బ్యాట్‌తోనూ రాణిస్తున్న ఆ కీలక ఆటగాడే రోలోఫ్ వాన్ డెర్ మెర్వే.

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి నెదర్లాండ్స్‌ పెను ప్రకంపనలు సృష్టించింది. తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందన్న దశ నుంచి అమాంతం పుంజుకుని మహా సంగ్రామంలో అద్భుతం చేసింది. అన్ని విభాగాల్లో రాణించి ప్రొటీస్‌కు మరచిపోలేని షాక్‌ ఇచ్చింది. అయితే నెదర్లాండ్స్‌ అద్భుత విజయం వెనక ఒక ఆటగాడి పాత్ర ఎంతో ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్ఫూర్తి నింపుతూ.. బంతితోనూ బ్యాట్‌తోనూ రాణిస్తున్న ఆ కీలక ఆటగాడే రోలోఫ్ వాన్ డెర్ మెర్వే. దక్షిణాఫ్రికాలో పుట్టి.. అక్కడే క్రికెట్‌ ఓనమాలు నేర్చుకుని... ప్రొటీస్‌ జట్టుతో కలిసి అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడిన మెర్వే.. ఇప్పుడు ఆ జట్టు ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించాడు. సఫారీ జట్టును వీడి నెదర్లాండ్స్‌ జట్టులో చేరే వరకు మేర్వే ప్రయాణం స్ఫూర్తి దాయకమే.
 
క్రికెట్‌ ఓనమాలు దక్షిణాఫ్రికాలోనే...
వాన్ డెర్ మెర్వే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీల్లో మెర్వే ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.  దక్షిణాఫ్రికా తరపున అండర్-19, సౌతాఫ్రికా-A జట్ల తరపున కూడా ఆడాడు. 2009వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వాన్ డెర్ మెర్వే... 2009-2010 మధ్య  13 వన్డేలు, 13టీ ట్వంటీలు ఆడాడు. 2015 వరకు దక్షిణాఫ్రిగా జట్టులో అవకాశాల కోసం ఎదురు చూశాడు. కానీ స్థిరమైన అవకాశాలు రాకపోవడంతో ఈ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్-రౌండర్ సఫారీ జట్టును వదిలి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లాడు. 
 
నెదర్లాండ్స్‌తో ప్రయాణం ఇలా...
2015లో మెర్వే నెదర్లాండ్స్‌ జట్టులో చేరాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సారిగా డచ్‌ జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 2016లో భారత్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌నకు ఇక్కడికి వచ్చాడు. 2015 నుంచి 2019 వరకు టీ ట్వంటీలకే పరిమితమైన మెర్వే 2019లో వన్డేల్లో జట్టులోకి వచ్చాడు. 2021, 2022లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్‌లోనూ నెదర్లాండ్స్ టీం తరపున మెర్వే బరిలోకి దిగాడు. 
 
దక్షిణాఫ్రికాపై గెలుపులో కీలక పాత్ర
దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సాధించిన చారిత్రాత్మక విజయంలో  మెర్వే కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కు బ్యాటింగ్‌లో మంచి సహకారం అందించాడు. ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు చేసి నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను నడిపించగా, వాన్ డెర్ మెర్వే 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఎడ్వర్డ్స్‌కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో  140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల నుంచి డచ్‌ జట్టు మంచి స్కోరు సాధించింది. వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెర్వే తన తొమ్మిది ఓవర్ల స్పెల్‌లో కేవలం 34 పరుగలుు ఇచ్చి రెండు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా సారధి బవూమా,  వాన్‌డెర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.  దీంతో దక్షిణాఫ్రికా కేవలం 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు పునరాగమనం చేసే అవకాశం రాలేదు. వాన్ డెర్ మెర్వే తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో తాను గతంలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టునే మట్టికరిపించాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
BMW CE 02: ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Embed widget