అన్వేషించండి

Rishabh Pant: ఆ ఘటన తలుచుకుని, వణికిపోయిన రిషబ్‌ పంత్‌

Rishabh Pant: ఆనాడు జరిగిన ప్రమాదాన్ని తలుచుకుని రిషబ్‌ పంత్‌ మరోసారి వణికిపోయాడు. కాలు తీసేస్తారమో అనుకుని భయపడి పోయానని పంత్‌ అన్నాడు.

Rishabh pant car accident: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఏడాది క్రితం డిసెంబర్‌ 30న పంత్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఇప్పటికీ ఈ ప్రమాదం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆనాడు జరిగిన ప్రమాదాన్ని తలుచుకుని రిషబ్‌ పంత్‌ మరోసారి వణికిపోయాడు. కాలు తీసేస్తారమో అనుకుని భయపడి పోయానని పంత్‌ అన్నాడు.
 
కాలు తొలగిస్తే...
గత ఏడాది తన కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత నరాలు దెబ్బ తిన్నాయేమో అనుకుని భయపడిపోయానని పంత్‌ అన్నాడు. అదే జరిగితే కాలు తొలగించే అవకాశం ఉంటుందని... ఈ విషయం తలుచుకుంటే భయం వేసిందని నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రమాదం తర్వాత కొందరు వచ్చి సాయం చేశారని.... తన కాలు సరి చేయమని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగానని... తనను వేరే కారుకు మార్చినట్టు మాత్రమే జ్ఞాపకముందని... తర్వాత ఏదీ గుర్తులేదని పంత్‌ తెలిపాడు. 
 
శ్రమిస్తున్న పంత్‌
కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్(IPL) టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో పంత్ కూడా ఉన్నాడు. అతను దక్షిణాఫ్రికాలో సిరీస్ కు భారత్ జట్టులో ఎంపిక కానప్పటికీ.. గత నెలలో జాదవ్ పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్ లో శిక్షణా శిబిరంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులతో చేరాడు. పంత్ మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. తిరిగి వస్తున్నాను అని పంత్ రాశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో బరువులు ఎత్తుతూ పుష్‌అప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్‌రీ రిప్ అని పంత్‌ కామెంట్ పెట్టాడు. అంటే ఏ అవకాశాన్ని వదలట్లేదని అర్థం వచ్చేలా అన్నాడు. పంత్‌ను ఐపీఎల్- 2024 కోసం ఢిల్లీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోగా.. భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ కోసం.. చెన్నై సూపర్ కింగ్స్ పంత్‌ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. ధోనీ వారసుడిగా పంత్‌ కోసం చెన్నై చూస్తుండొచ్చని, ఇది మంచి ఎంపిక అని వ్యాఖ్యానించాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget