IND VS PAK :' శాస్త్రి గారు.. అది హెడ్స్ కాదు టెయిల్స్''
IND VS PAK: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో ఒక సంఘటన జరిగింది. వ్యాఖ్యాతల బృందంలో ఒకరైన రవిశాస్త్రి ఒక పొరపాటు చేశారు. టెయిల్స్ ని పొరపాటుగా హెడ్స్ అని చెప్పారు.
భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో ఒక సంఘటన జరిగింది. వ్యాఖ్యాతల బృందంలో ఒకరైన రవిశాస్త్రి ఒక పొరపాటు చేశారు. టాస్ ఎవరిదో నిర్ణయించేందుకు రోహిత్ శర్మ నాణేన్ని పైకి ఎగురవేయగా.. పాక్ కెప్టెన్ బాబార్ టెయిల్స్ అని చెప్పాడు. అయితే రవిశాస్త్రి దాన్ని హెడ్స్ గా పొరపాటుగా ప్రకటించాడు. అక్కడే ఉన్న మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ కలగజేసుకుని అది హెడ్స్ కాదు టెయిల్స్ అని శాస్త్రికి చెప్పారు. టెయిల్స్ పడటంతో బాబర్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ పగ తీర్చుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
The coin has favoured Babar, check out below what Pakistan chose to do!
— Star Sports (@StarSportsIndia) September 4, 2022
Keep watching #INDvPAK at the DP World #AsiaCup2022 on Star Sports & Disney+Hotstar!#BelieveInBlue #GreatestRivalry - Round2 pic.twitter.com/C2PyULDCRB
Pakistan have won the toss and elect to bowl first.
— BCCI (@BCCI) September 4, 2022
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/mxxy1wDwKp