అన్వేషించండి

Injury Management Crisis: CoE చుట్టూ ముదురుతున్న వివాదం.. బుమ్రా టెస్ట్ మిస్సింగ్‌పై రచ్చ, జవాబుదారీతనం ఉండాలంటూ అశ్విన్ ఘాటువ్యాఖ్యలు

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ విభాగం తీరుపై తీవ్ర విమర్శలు వస్తుండగా ఆటగాళ్ల గాయాల నిర్వహణలో జవాబుదారీతనం అవసరమని రవిచంద్రన్ అశ్విన్ విమ‌ర్శించాడు.

Former Indian Spinner Highlights Flaws In National Cricket Academy Setup: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలోని బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు తరచూ గాయాల బారిన పడటం, వారు కోలుకోవడానికి నెలల తరబడి సమయం పడుతుండటంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీవోఈ స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీకి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తాజా కథనం పేర్కొంది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు మొదట బలంగా భావించారు. అయితే అతడి గాయం తీవ్రత అనుకున్నదానికంటే ఎక్కువని ఆ తర్వాత తెలియడంతో సెలెక్టర్లు విస్మయానికి లోన‌య్యారు. ఈ వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: Historic Silver Glory: 28 ఏళ్ల నిరీక్షణకు మీరాబాయి చాను తెర.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతంతో సరికొత్త చరిత్ర  

ఎవరికీ బాధ్యత లేదా..?
ఈ మొత్తం పరిణామాలపై భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్రంగా విమ‌ర్శించాడు. "టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు జట్లను ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది. ఆటగాళ్ల గాయాల నిర్వహణ విషయంలో ఎక్కడో ఒకచోట కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. వరుణ్ చక్రవర్తి గత మూడు నాలుగు నెలలుగా ఎన్‌సీఏలోనే ఉన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) కోసం అతడికి అనుమతి కావాలని మేము అడిగితే విడుదల చేయలేదు. నెల రోజుల్లో తిరిగి రావాల్సిన వాడు రెండు మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయాడు" అని అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.

Read Also: Gambhir Sleepless Night: సంజూను తప్పించిన రాత్రి నిద్రపట్టలేదు.. వైభవ్ కోసం కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పిన‌ గంభీర్

ఒలింపిక్ లిఫ్టింగ్‌తో ముప్పు.. 
ఆటగాళ్లు కూడా తమ ఫిట్‌నెస్ శిక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అశ్విన్ పేర్కొన్నాడు. "ఒక ప్లేయర్‌గా మీరు అనుసరిస్తున్న ట్రైనింగ్ పద్ధతి సరైందో కాదో చూసుకోవాలి. మనం సరైన వ్యాయామాలే చేస్తున్నామా అనేది గమనించుకోవాలి. నా కెరీర్‌లో 2015లో నాకు సైడ్ స్ట్రెయిన్ గాయం వచ్చింది, అది కేవలం ఒలింపిక్ లిఫ్టింగ్ చేయడం వల్లే జరిగింది. ఆ గాయం తర్వాత నేను స్నాచింగ్ చేయడం పూర్తిగా ఆపేశాను. ఒలింపిక్ లిఫ్టింగ్‌తో వేగం పెరగవచ్చు, శరీరంలో పవర్ కూడా పెరుగుతుంది. అయితే ఆ తరహా వ్యాయామాలు శరీరాకి సరిపడనప్పుడు ఆటగాడు ఏం చేస్తున్నాడో స్వయంగా ఓ కన్నేసి ఉంచాలి" అని తెలిపాడు.

సమన్వయ లోపంపై బోర్డు గుర్రు..
కీలక సిరీస్‌ల సమయంలో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం టీమ్ ఇండియా అవకాశాలను ప్ర‌భావితం చేస్తోంది. మెడికల్ టీమ్ ఇచ్చే నివేదికలు, గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేకపోవడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఆటగాళ్ల రీహాబిలిటేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget