అన్వేషించండి

Mohammed Shami: ప్చ్! లాభం లేదు షమీని దింపాల్సిదే- బుమ్రా మినహా భారత పేసర్లపై పెదవి విరిచిన మాజీ కోచ్

Ind vs Aus: తొలి టెస్టులో మంచి జోరులో జట్టును గెలిపించిన భారత బౌలర్లు రెండో మ్యాచ్ లో మాత్రం తేలిపోయారు. అర్జెంటుగా భారత పేస్ దళాన్ని బలోపేతం చేయాలని శాస్త్రి సూచిస్తున్నాడు. 

Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ రెండో టెస్టులో వెనుకంజలో నిలిచింది. తొలుత బ్యాటర్ల వైఫల్యంతో తక్కువ స్కోరే చేసిన టీమిండియా, ఆ తర్వాత బౌలింగ్ లోనూ తేలి పోయింది. తురుపు ముక్క జస్ఫ్రీత్ బుమ్రా మినహా మిగతా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీనిపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పేసర్లు ఆసీస్ బ్యాటర్లకు ఇబ్బంది పెట్టలేక పోయారని అభిప్రాయ పడ్డాడు.

బుమ్రా ఒక్కడే..
రెండో టెస్టు రెండో రోజులో ఒక్క జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే ఆసీస్ ను నిలువరించగలిగాడని శాస్త్రి పేర్కొన్నాడు. అతను ఉన్నంత వరకు కంగారూ బ్యాటర్లు ఆచితూచి ఆడారని, అతని స్పెల్ అయిపోగానే మిగతా బౌలర్లపై విరుచుకు పడ్డారని తెలిపాడు. ముఖ్యంగా కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న హర్షిత్ రాణా తేలిపోయడని విమర్శించాడు. లైన్ అండ్ లెంగ్త్ పై ఆధార పడకుండా కేవలం వేగాన్ని నమ్ముకుని బండి నడిపే హర్షిత్ శైలిపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దీంతో శాస్త్రి ఏకీభవించాడు. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ దూకుడుకు అతని వద్ద సమాధానమే లేదని అభిప్రాయ పడ్డాడు. అతను 16 ఓవర్లలోనే 86 పరుగులను ఐదుకుపైగా ఎకానీమీతో సమర్పించుకున్నాడు. అయితే సిరాజ్ మాత్రం ఆఖర్లో కంగారులను ఇబ్బంది పెట్టగలిగాడు. ఓవరాల్ గా బుమ్రాతో సమానంగా నాలుగు వికెట్లు తీశాడు. 

షమీని దింపాల్సిందే..
వీలైనంత తొందరగా ఆసీస్ గడ్డపైకి షమీని దింపాల్సిందేనని శాస్త్రి వ్యాఖ్యానించాడు. గాయం నుంచి కోలుకుని దేశవాళీ టోర్నీల్లో తను సత్తా చాటుతున్నాడని, చాలా అనుభవం కూడా ఉండటం షమీకి పెద్ద ప్లస్ పాయింటని అభిప్రాయ పడ్డాడు. బుమ్రాకు షమీ తోడైతే కంగారూలను మరింత ఒత్తిడిలోకి నెట్టవచ్చని పేర్కొన్నాడు. మూడో టెస్టుకు అందుబాటులోకి రాకపోయినా, నాలుగో టెస్టు వరకైనా షమీని తుది జట్టులో ఆడించాలని భారత టీమ్ మేనేజ్మెంట్ కు సూచించాడు. 

అదరగొడుతున్న షమీ..
ఇక నవంబర్ లో గాయం నుంచి కోలుకుని డొమెస్టిక్ క్రికెట్లో పునరాగమనం చేసిన షమీ.. అదరగొడుతున్నాడు. రంజీ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన షమీ.. తర్వాత జరిగిన ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అదరగొట్టాడు. మరోవైపు షమీ వీలైనంత త్వరగా ఆసీస్ వెళ్లేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని సమాచారం. ఇప్పటికే వీసా రెడీ చేయగా, షమీ కిట్టును ఆల్రెడీ ఆసీస్ కు పంపినట్లు తెలుస్తోంది. 

ఇక ఐదు మ్యాచ్ లో సిరీస్ ను గెలవడం భారత్ కు ఎంతో ముఖ్యం. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలంటే భారత్  కనీసం ఇంకా రెండు టెస్టులనైనా గెలుపొందాలి. పెర్త్ టెస్టులో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.. అడిలైడ్ టెస్టులో మాత్రం ఓటమి దిశగా సాగుతోంది. అయితే మిగతా మూడు టెస్టుల్లో కనీసం రెండు గెలిస్తే, దాదాపుగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును భారత్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించింది. అయితే  రెండుసార్లు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారైనా ఫైనల్ కి వెళ్లి, చాంపియన్ గా నిలిచి ఐసీసీ గదను దక్కించుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. 

Also Read: Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget