అన్వేషించండి
Advertisement
Ranji Trophy Semifinals: రంజీ సెమీస్‌ల్లో బౌలర్ల జోరు, చెలరేగిన ఆవేశ్‌ఖాన్, శార్దూల్
Ranji Trophy: దేశవాళీ ప్రతిష్టాత్మక టర్నమెంట్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్-విదర్భ మధ్య సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది.
Ranji Trophy Semifinals: దేశవాళీ ప్రతిష్టాత్మక టర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో మధ్యప్రదేశ్-విదర్భ మధ్య తొలి సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజు ఆటలో మధ్యప్రదేశ్ బౌలర్లు చెలరేగడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. 32 పరుగుల వద్ద ప్రారంభమైన విదర్భ వికెట్ల పతనం ఆ తర్వాత వేగంగా కొనసాగింది. కరుణ్ నాయర్(63) హాఫ్ సెంచరీతో పోరాడకపోతే ఇంకాస్త ముందుగానే విదర్భ ఇన్నింగ్స్ ముగిసేది. మధ్యప్రదేశ్ బౌలర్లలో పేసర్ అవేష్ ఖాన్ 4 వికెట్లతో ప్రత్యర్ధి జట్టు దెబ్బతీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, వెంకటేశ్ అయ్యర్ తలా రెండు వికెట్లతో రాణించారు. విధర్బ బ్యాటర్లలో కరుణ్ నాయర్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ టైడే(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
రెండో సెమీస్‌లో ముంబై పేసర్ల ధాటికి తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబైకి శార్ధూల్ శుభారంభమిచ్చాడు. తొలి ఓవర్లోనే సాయి సుదర్శన్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తుషార్ దేశ్‌పాండే తమిళనాడు భరతం పట్టాడు. కెప్టెన్ సాయి కిశోర్‌ను ఔట్ చేయడంతో 10.1 ఓవర్లలో తమిళనాడు 17 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడ్డ జట్టును బాబా ఇంద్రజిత్, విజయ్ శంకర్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
కానీ, దేశ్‌పాండే ఈ జోడీని విడదీసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లతో తమిళనాడు పతనాన్ని శాసించారు. వీరి ధాటికి తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ముషీర్ ఖాన్(24 నాటౌట్), మోహిత్ అవస్థి(1)లు ఆచితూచి ఆడారు. దాంతో, ముంబై ఆటముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.
బరిలోకి దిగిన అయ్యర్
దేశవాళీ టోర్నీల్లో స్టార్ క్రికెటర్లు ఆడకపోవడంపై బీసీసీఐ(BCCI) కన్నెర్ర చేయడంతో ఆటగాళ్ల తీరు మారుతోంది. బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెమీఫైనల్లో బరిలోకి దిగాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి అయ్యర్‌ను ముంబై సెలక్టర్లుఎంపిక చేశారు. రంజీ సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు అయ్యర్ సమాచారం ఇచ్చాడు. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్ స్పష్టం చేశాడు. దీంతో అయ్యర్‌ను టీంలోకి తీసుకుంటూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. రంజీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ కోరగా ఫిట్‌నెస్‌తో లేనని అయ్యర్ తెలిపాడు. బీసీసీఐ మాట పెడచెవిన పెడుతూ ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో అతడిపై వేటు పడింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆటో
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion