అన్వేషించండి

Ranji Trophy final: రంజీ ఫైనల్లో ముంబై జోరు, మరో కప్పు ఖాయమే!

Mumbai vs Vidarbha Final, Ranji Trophy: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీని ఇప్పటికే 41 సార్లు గెలుచుకున్న ముంబై..మరోసారి కప్పును కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Ajinkya Rahane, Musheer Khan Shine, Mumbai On Top vs Vidarbha At Stumps: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ( Ranji Trophy)ని మరోసారి కైవసం చేసుకునే దిశగా ముంబై(Mumbai ) పయనిస్తోంది. ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబై..మరోసారి కప్పును కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వాంఖెడే స్టేడియం వేదికగా  విదర్భతో జరుగుతున్న ఫైనల్లో పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. విదర్భను తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్‌ చేసి 119 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ముంబై.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై.. 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఆ జట్టు ఇప్పటికే 260 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ముంబై బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ (51 బ్యాటింగ్‌), కెప్టెన్‌ అజింక్యా రహానే (58 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 260 పరుగుల ఆధిక్యంలో ఉన్న ముంబై ఫైనల్‌పై పట్టు సాధించినట్లే. మూడో రోజు ఇలాగే ముంబై బ్యాటర్ల జోరు కొనసాగితే విదర్భ ఎదుట భారీ లక్ష్యం నిలిపే అవకాశం ఉంది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో
విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్‌ అయింది. మొదటి రోజే 30 పరుగులు కూడా చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ.. రెండో రోజు కూడా అదే కొనసాగించింది. ముంబై బౌలర్ల ముందు విదర్భ బౌలర్లు నిలపడలేకపోయారు. యశ్‌ రాథోడ్‌ ఒక్కడే 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ధవల్‌ కులకర్ణి, శామ్స్‌ ములానీ, తనూష్‌ కొటియాన్‌లు తలా మూడు వికెట్లు తీయగా శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌట్‌ అయింది. 
 
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌(Ranji Trophy Final) రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్లో ముంబై, విదర్భ(MUM vs VID) రంజీ టైటిల్‌ కోసం తలపడతుండగా... తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తక్కువ పరుగులకే పరిమితమైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. కష్టాల్లో కూరుకుపోయిన ముంబై జట్టు 224 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించిందంటే దానికి కారణం శార్దూల్‌ ఠాకూర్‌. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులైనా చేస్తుందా అన్న స్థితి నుంచి ముంబైకు శార్దూల్‌ గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
 
ముంబై బ్యాటింగ్‌..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి మంచి ఆరంభమే దక్కింది. వాంఖడే మైదానంలో  ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్‌ లల్వాని (37) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఓ దశలో 81-1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. రహానే(7), శ్రేయాస్‌ అయ్యర్‌(7) తక్కువ పరుగులకే వెనుదిరగగా... శార్దుల్‌ ఠాకూర్‌ వన్డే తరహాలో ఆడి 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు.ఈ తరుణంలో శార్దుల్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గాడిలో పడేశాడు.  . ముషీర్‌ ఖాన్‌ (6) విఫలమయ్యాడు. శార్దుల్‌ సాధికారిక ఇన్నింగ్స్‌తో ముంబై తేరుకుంది. హర్ష్‌ దూబే, యశ్‌ ఠాకూర్‌ మూడేసి వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget